Vikram in SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో.. చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కి సిద్ధం అవుతోంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు చాలానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. సినిమాకి సంబంధించి ఏవో వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నాయి కానీ షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా నటీనటులకు సంబంధించిన ప్రతి అప్డేట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర లో ఒక తమిళ్ స్టార్ హీరో నటిస్తున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. 


ఆ హీరో చియాన్ విక్రమ్. తమిళ్లో స్టార్ హీరో అయిన విక్రమ్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే విక్రమ్ రాజమౌళి సినిమా గురించి జవాబు ఇచ్చారు. తాజాగా ఒక సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు. మొదట రాజమౌళి గురించి ప్రశ్న మొదలు పెట్టగానే.. విక్రమ్ వెంటనే రాజమౌళి చాలా మంచి డైరెక్టర్ అంటూ కితాబు ఇచ్చేశారు. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా అని ప్రశ్నించగా.. విక్రమ్ దానికి గమ్మత్తుగా జవాబు ఇచ్చారు. 


ఆ ప్రశ్నకి విక్రమ్ ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. "రాజమౌళి గారితో ఒక సినిమా అయితే కచ్చితంగా ఉంటుంది.. అది ఈ సినిమానే అప్పుడే చెప్పలేము" అని అన్నారు విక్రమ్. అలా చూసినా రాజమౌళి చేతిలో ఇప్పుడు ఒక్క మహేష్ బాబు సినిమా తప్ప మారే సినిమా లేదు. కాబట్టి విక్రమ్ నటిస్తున్నారు అంటే అది ఈ సినిమాలోనే అవ్వాలి.  


ఈ నేపథ్యంలో విక్రమ్ కచ్చితంగా మహేష్ బాబు సినిమాలో ఒక చాలా ముఖ్యమైన పాత్ర.. పోషిస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజం అయితే, క్రేజీ కాంబినేషన్ అని చెప్పచ్చు. అయితే విక్రమ్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తారా అంటే.. ఇప్పటికే పృధ్వీరాజ్ సుకుమారన్.. విలన్ పాత్ర పోషిస్తున్నారు. మరి విక్రమ్ పాత్ర ఎలా ఉంటుంది అని మాత్రం వేచి చూడల్సి ఉంది.


Also Read: Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..


Also Read: Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter