Karna Teaser: వావ్ అనిపించేలా.. విక్రమ్ `కర్ణ` టీజర్?
Karna Movie: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కర్ణుడిగా నటిస్తున్న చిత్రం కర్ణ. ఆదివారం ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రచార చిత్రం ఎలా ఉందంటే..
Karna Movie Teaser: పొన్నియన్ సెల్వన్ సినిమా వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత విక్రమ్ నుంచి రాబోతున్న సినిమా కర్ణ. ఈ మూవీని 2017లోనే అనౌన్స్ చేసినప్పటికీ.. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రెండు రోజుల కిందట ఈ మూవీ షూటింగ్ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు డైరెక్టర్. ఆదివారం సాయంత్రం రిలీజైన ఈ మూవీ టీజర్ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
మహాభారతంలోని కర్ణుణి పాత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కురుక్షేత్రంలోని యుద్ధ సన్నివేశంతో ఈ మూవీ టీజర్ ప్రారంభం అవుతుంది. ఇందులో విజువల్స్ వీర లెవల్లో ఉన్నాయి. చియాన్ విక్రమ్ కర్ణుడి పాత్రలో కనిపించాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అనే చెప్పాలి. తాజాగా రిలీజైన ప్రచార చిత్రం మూవీపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ మూవీ 3D వెర్షన్ లో అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
ఈ మూవీని ఆర్ఎస్ విమల్ డైరెక్ట్ చేస్తున్నారు. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ముందు పృథ్వీరాజ్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. దీంతో విక్రమ్ హీరోగా ఈ మూవీని ప్రకటించారు విమల్.
బ్యాక్ టుబ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీ అయ్యాడు విక్రమ్. మరోవైపు తంగలాన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు చియాన్. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే సినిమాపై ఎనలేని క్యూరియాసిటీని పెంచేశాయి. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకోవైపు ఆయన నటించిన ధృవ నక్షత్రం(Dhruva Natchathiram) మూవీని కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook