Jawan Movie: చరిత్ర సృష్టించిన షారుఖ్.. ఒకే ఏడాదిలో రెండు సార్లు 1000 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు..

Jawan Movie: షారుక్ 'జవాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తాజాగా ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ఒకే ఏడాదిలో రెండు సార్లు రూ.1000 కోట్ల కొల్లగొట్టిన  హీరోగా షారుక్ చరిత్ర సృష్టించాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2023, 12:20 PM IST
Jawan Movie: చరిత్ర సృష్టించిన షారుఖ్.. ఒకే ఏడాదిలో రెండు సార్లు 1000 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు..

Jawan Enter Into 1000 Crore Club: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan)- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్  అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. రిలీజైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా రూ. 1000 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ ఏడాది ప‌ఠాన్ సినిమాతో రూ.1000 కోట్ల మార్కును దాటిన షారుఖ్.. తాజాగా జవాన్ సినిమాతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. కేవలం 19 రోజుల్లోనే జవాన్ ఈ ఫీట్ సాధించింది. ఒకే సంవత్సరం వరుసగా రెండుసార్లు ఈ అరుదైన ఘనత సాధించిన హీరోగా షారుఖ్‌ఖాన్‌ చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఈ మూవీతో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తమిళ డైరెక్టర్ గా అట్లీ అరుదైన ఘనత సాధించాడు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుక్ జోడిగా నయనతార (Nayanathara) నటించారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathy) విలన్ గా నటించారు. ఈ చిత్రంలో దీపిక పదుకొణె (Deepika Padukone), సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు. ప్రియమణి, సాన్య మల్హోత్ర, సునీల్‌ గ్రోవర్‌, యోగిబాబు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. 

అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అక్టోబరు చివరిలో లేదా నవంబరు మెుదటి వారంలో ఓటీటీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ఓటీటీ కట్‌ వెర్షన్‌ మరోలా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో మరికొన్ని సీన్స్ ను మేకర్స్‌ యాడ్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఓటీటీ రన్ టైమ్ 3 గంటలపైగా వస్తుందని సమాచారం. థియేటర్‌లో ఈ సినిమా 2గంటల 45 నిమిషాల నిడివితో విడుదలైంది. జవాన్‌ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ. 250 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. 

Also Read: Game Changer: రామ్‌చ‌ర‌ణ్‌కు గాయం... గేమ్‌ఛేంజ‌ర్ షూటింగ్‌ వాయిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News