Thangalaan Trailer Talk: చియాన్ విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ వంటి రెండు సినిమాల తర్వాత వస్తోన్న చిత్రం ‘తంగలాన్’. ఈ సినిమా కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్  డైరెక్ట్ చేస్తున్నారు.  నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ కథానాయికలుగా యాక్ట్ చేస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో బ్రిటిష్ కాలంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.త్వరలో  "తంగలాన్" సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.  తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


‘తంగలాన్’ ట్రైలర్ విషయానికొస్తే.. బ్రిటిష్ పాలనా కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. బ్రిటిష్ వాళ్లు అక్కడ స్థానికంగా ఉంటున్న తెగల వారిని బంగారం వెలికి తీసేందుకు పనిలో పెట్టుకుంటారు. ఒక తెగ నాయకుడిగా విక్రమ్ కనిపించనున్నారు.


ఈ బంగారం వేటలో రెండు తెగల మధ్య వార్ స్టార్ట్ అవుతోంది. తన తెగ వారిని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయని నాయకుడిగా విక్రమ్ నటించారు.ఈ పాత్రలో విక్రమ్ ఒదిగిపోయిన తీరు ప్రశంసనీయం. అంతేకాదు నటుడిగా ఆయన చూపించిన ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్ ఈ పాత్ర కోసం మారిపోయిన తీరు చూస్తే క్యారెక్టర్ కోసం ఆయన పడే తనప ఏంటో అర్దమవుతోంది.  ట్రైలర్ లో విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్సులు బాగున్నాయి.  విక్రమ్ నల్ల చిరుతతో చేసిన ఫైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.  చరిత్రలోని జరిగిన కొన్ని సంఘటనకు కాల్పనికం జోడించి  వాస్తవ ఘట్టాలను దర్శకుడు పా రంజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు "తంగలాన్" ట్రైలర్ తో తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాను విడుదల తేదిని అనౌన్స్ చేయనున్నారు.


నటీనటులు - చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఎస్ఎస్ మూర్తి ఆర్ట్ వర్క్ బాగుంది. అప్పటి బ్రిటిష్ కాలాన్ని కళ్లకు కట్టేలా సెట్స్ వేశారు. ఆర్కే సెల్వ ఎడిటింగ్. స్టన్నర్ సామ్ స్టంట్స్ సమకూర్చారు.


Read more: CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి