CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Hyderabad: విద్యార్థుల ముసుగులో కోచింగ్ సెంటర్లు కిరాయి మనుషుల చేత నిరసలను తెలియజేస్తున్నాయని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని విద్యార్థులను రెచ్చగోడుతున్నారని అన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 10, 2024, 09:07 AM IST
  • విద్యార్థులు వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా..
  • వెనక్కు తగ్గని స్టూడెంట్స్..
CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

CM Revanth reddy fires on coaching centres: తెలంగాణలో కొన్నిరోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు నిరసలను చేపడుతున్నారు. ఒకవైపు గ్రూప్స్ అభ్యర్థులు, మరోవైపు డీఎస్సీ అభ్యర్థులు ఎగ్జామ్ లను వాయిదా వేయాలని నిరసనలు చేపట్టారు.గతంలో కాంగ్రెస్ సర్కారు గ్రూప్స్, డీఎస్సీ లలో పోస్టుల సంఖ్యను పెంచుతానని చెప్పి, ఇప్పుడు తమను మోసం చేసిందని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రస్తుతం పోస్టులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, ప్రిపరేషన్ కు కూడా సమయంలేదని వాపోతున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హమీల మేరకు.. పోస్టుల సంఖ్యలను పెంచి, ఎగ్జామ్ లను వాయిదావేసి రీషెడ్యూల్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 

 

 

ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్ లో నిరుద్యోగులు చేపట్టిన నిరసనలు పీక్స్ కు చేరాయి. పోలీసులు ఎక్కడికక్కడ బారికెడ్లు వేసి మరీ, నిరసనలు తెలియజేస్తున్న వారందరిని అరెస్ట్ చేశారు. అంతేకాండా.. ఎక్కడికక్కడ పోలీసులు విద్యార్థి సంఘాలు నాయకులు, అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడాలేకుండా అరెస్టులు చేశారు. ఇదిలా ఉండగా.. డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యంగా గత రాత్రి.. ఓయూలో కూడా నిరసలను తెలియజేశారు. రాత్రంతా మెల్కోని ఉండి, డీఎస్సీ, గ్రూప్స్ లపై నిరసలు తెలియజేశారు. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ కూడా అరెస్టుల పర్వం కొనసాగించారు. దీంతో ఓయూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

 

 ప్రశాంతంగా నిరసనలు తెలియజేస్తున్న కూడా పోలీసులు విద్యార్థులను అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిరసన కాస్త హింసాత్మకంగా కూడా మారింది. ప్రభుత్వం వన్ సైడ్ మాత్రమే ఆలోచిస్తుందని, తమ గోడును అర్థంచేసుకుని పోస్టుల సంఖ్యలను పెంచి, తమకు న్యాయం చేయాలని కూడా నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వరుస నిరసలనపై స్పందించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కేంద్రంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల వెనుక రాజకీయ శక్తులున్నాయని, కొందరు కోచింగ్ సెంటర్ మాఫీయాలు నిరుద్యోగులను రెచ్చగోడుతున్నారంటూ కూడా రేవంత్ మండిపడ్డారు.

కొందరు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కావాలనే.. కిరాయి మనుషుల్ని పెట్టీ మరీ నిరసలను చేయిస్తున్నారని అన్నారు. గ్రూప్స్ కోచింగ్ అనేది ఒక బిజినెస్ లాగా మారిపోయిందని,ఒక్కనెల ఎగ్జామ్ వాయిదా పడితే.. కోచింగ్ సెంట్లర్లు వందల కోట్ల లాభాలు గడిస్తాయని సీఎం రేవంత్ అన్నారు. వాళ్లు డబ్బులు సంపాదించడానికే ఈ విధంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు.

Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..

మరోవైపు నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం.. తమ వెనుక రాజకీయ నేతలు కానీ, పార్టీలు కానీ లేవని స్పష్టం చేస్తున్నారు. ఇది తమ జీవితానికి చెందిన విషయమని, ఇంట్లో ఉన్న ఆస్తులు, డబ్బులు ఖర్చుపెట్టి మరీ కోచింగ్ లు తీసుకుంటున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల నిరసనపై బీజేవైఎం, బీఆర్ఎస్ లు ఇప్పటికే తమ మద్దతు తెలిపాయి. తెలంగాణలో మాత్రం నిరుద్యోగుల  నిరసన ఘటన మాత్రం హట్ టాపిక్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News