Cobra Movie First Review: కోబ్రా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. దుమ్ము రేపిన విక్రమ్
`Chiyan Vikram` Cobra Movie First Review: విక్రమ్ హీరోగా కోబ్రా మూవీ ప్రేక్షకులకు రాబోతోంది. దానికి సంబందించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఆ వివరాలు
'Chiyan Vikram' Cobra Movie First Review: చాలా కాలం తర్వాత మహాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఆయన సుమారు ఏడు పాత్రలలో నటించిన తాజా చిత్రం కోబ్రా. ఈ సినిమాలో కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో ఆగస్టు 31వ తేదీ సినిమా వాయిదా పడింది.
వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే అన్ని సినిమాలకు ముందే రివ్యూ ఇచ్చే దుబాయ్ కి చెందిన స్వయం ప్రకటిత ఫిలిం క్రిటిక్ అక్కడి దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఉమైర్ సంధూ కోబ్రా సినిమాకి కూడా తన రివ్యూ ఇచ్చేశారు. ఈ సినిమా గురించి ఆయన ట్వీట్ చేస్తూ సినిమాలో హీరో విక్రమ్ మరోసారి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని తన నడుముతో సినిమాకి హైలైట్ గా నిలిచారని ఆయన విక్రమ్ గురించి చెప్పుకొచ్చారు.
ఇక అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉందని టెర్రిఫిక్ గా ఉందని చెప్పుకొచ్చారు. ఇక సినిమా గురించి ముఖ్యంగా క్లైమాక్స్ అలాగే ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా కుదిరాయని ఉమైర్ సంధూ పేర్కొన్నారు. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కి సినిమాలో కీలక పాత్రలో నటించగా ఆయన కూడా తనదైన శైలిలో అద్భుతంగా నటించారని, ఉమైర్ సంధు పేర్కొన్నారు. ఈ సినిమాని దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారని ఈ సినిమాకు మల్టీప్లెక్స్ ఆడియన్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతారని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఎలా అట్రాక్ట్ చేస్తుంది అనేది చూడాలి. అయితే ఉమైర్ సంధూ రివ్యూలను నమ్మే ప్రసక్తే లేదంటున్నారు కొందరు. ఎందుకంటే ఈయన తనకు నచ్చిన వాళ్ళ సినిమాలు బాగున్నాయని ట్వీట్లు చేస్తారు కానీ నచ్చని సినిమాలకు దారుణమైన రేటింగ్ ఇస్తారని ఇటీవల లైగర్ సినిమా కూడా అద్భుతంగా ఉందని ఆయన రివ్యూ ఇచ్చారు. కానీ లైగర్ సినిమా బొక్క బోర్లా పడింది. ఇక ఈ కోబ్రా సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన స్వయంగా విడుదల చేస్తున్నారు.
Also Read: Nag vs Mahesh babu: మహేష్ బాబుకి నాగ్ ఫాన్స్ లెఫ్ట్ అండ్ రైట్
Also Read: Ananya Nagalla Hot Photos: ధైస్ షోతో పిచ్చెక్కిస్తున్న అనన్య నాగళ్ల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి