Nag vs Mahesh babu: మహేష్ బాబుకి నాగ్ ఫాన్స్ లెఫ్ట్ అండ్ రైట్

Nag vs Mahesh babu: సోషల్ మీడియాపై టాలీవుడ్ అభిమానులు ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తుంటారు. హీరో అభిమానుల మధ్య సిల్లీ విషయాలకు ఘర్షణ జరుగుతుంటుంది. అటువంటిదే మహేశ్ బాబు వర్సెస్ నాగార్జున అభిమానుల మధ్య జరిగింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 30, 2022, 08:00 PM IST
Nag vs Mahesh babu: మహేష్ బాబుకి నాగ్ ఫాన్స్ లెఫ్ట్ అండ్ రైట్

Nag vs Mahesh babu: సోషల్ మీడియాపై టాలీవుడ్ అభిమానులు ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తుంటారు. హీరో అభిమానుల మధ్య సిల్లీ విషయాలకు ఘర్షణ జరుగుతుంటుంది. అటువంటిదే మహేశ్ బాబు వర్సెస్ నాగార్జున అభిమానుల మధ్య జరిగింది. 

సినీ హీరోలపై దక్షిణాది అభిమానుల పిచ్చి ఎప్పుడూ పరాకాష్టకు చేరుతుంటుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండటం దక్షిణాది హీరోల ప్రత్యేకత కాగా..అదే చాలా సందర్భాల్లో కొంప ముంచుతుంటోంది. ఘర్షణకు, ట్రోలింగ్‌కు దారి తీస్తుంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈసారి మహేశ్ బాబు వర్సెస్ నాగార్జున అభిమానుల మధ్య విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. 

నాగార్జున పుట్టినరోజు పురస్కరించుకుని మహేశ్ బాబు చేసిన ట్వీట్ ఇందుకు కారణమైంది. మహేశ్ బాబు తన ట్వీట్‌లో Happy birthday @iamnagarjuna!! Wishing you happiness and abundance always అని పోస్ట్ చేశాడు. అంతే నాగ్ అభిమానులు ఒక్కసారిగా మహేశ్ బాబుపై విరుచుకపడటం ప్రారంభించారు సీనియర్ నటుడు కదా..కాస్త గౌరవమిచ్చి సర్ అని సంభోధించలేరా అని ట్రోలింగ్ ప్రారంభించారు. 

నాగార్జున వయస్సు 63 సంవత్సరాలు..కనీసం గారు అని సంబోధించలేరా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇండస్ట్రీ లెజెండ్‌కు కాస్త గౌరవమివ్వండంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. వాస్తవానికి మహేశ్ బాబుకు, నాగార్జునకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. నాగార్జున ఘోస్ట్ ట్రైలర్‌ను కూడా ఇటీవల మహేశ్ బాబు లాంచ్ చేశాడు. అదే సమయంలో మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ చేయడం ఇష్టమని నాగార్జున వ్యాఖ్యానించాడు. 

ఈ ఇద్దరు అగ్రహీరోలు బాగానే ఉన్నా..అభిమానులు మాత్రం చిన్న చిన్న సిల్లీ విషయాలకు గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. హీరోల్ని ట్రోల్ చేస్తున్నారు. మేము మేము బానే ఉంటాం..మీరే మారాలి అన్న భరత్ అనే నేను ఈవెంట్‌లో మహేశ్ బాబు డైలాగ్ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి అభిమానులు. 

Also read: Ananya Nagalla Hot Photos: ధైస్ షోతో పిచ్చెక్కిస్తున్న అనన్య నాగళ్ల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News