Cobra Movie Telugu Review: చాలా కాలం తర్వాత సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చియాన్ విక్రమ్ కోబ్రా అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు . ఈ సినిమాల్లో చియాన్ విక్రమ్ ద్విపాత్రాభినయం చేయడమే కాక పలు ఇతర పాత్రల్లో కూడా కనిపించారు. మొత్తం సినిమాలో తొమ్మిది రకాల గెటప్స్ లో ఆయన కనిపిస్తూ ఉండడంతో పాటు సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ స్టాఫ్ అంతా కూడా సినిమాపై ఆసక్తి పెంచేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని విక్రమ్ అభిమానులైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆగస్టు 11వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 31వ తేదీన విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోబ్రా సినిమా కథ విషయానికి వస్తే?
మధీ(విక్రమ్) అనే ఒక మ్యాచ్ టీచర్ పిల్లలకు పాఠాలు చెబుతూనే మరోపక్క సుపారీ తీసుకుని మూడో కంటికి తెలియకుండా మర్డర్లు చేస్తూ ఉంటాడు. అది కూడా దేశాధినేతలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను ఎలాంటి క్లూ లేకుండా చంపేసి తప్పించుకుంటూ ఉంటాడు. అయితే అలా స్కాట్లాండ్ ప్రిన్స్ ను చంపిన తరువాత మధీని పట్టుకోవడం కోసం అస్లాం(ఇర్ఫాన్ పఠాన్) అనే ఇంటర్పోల్ అధికారి రంగంలోకి దిగుతాడు. ఆయన రంగంలోకి దిగిన తర్వాత ఇండియాలోని ఒరిస్సా ముఖ్యమంత్రి మర్డర్ వెనుక కూడా స్కాట్లాండ్ ప్రిన్స్ మర్డర్ లాంటి స్కెచ్ ఉందని తెలుసుకుంటాడు. దీని వెనుక మ్యాథ్స్ ఫార్ములాలతో కూడిన స్కెచ్ వేశారనే విషయం తెలుసుకుని ఇండియా వచ్చి ఇండియాలోని సిబిఐ సహకారంతో సదరు వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. మధీ మరో మర్డర్ చేయడానికి సిద్ధమవుతున్న క్రమంలో అతని గురించి పట్టించడానికి మరో హ్యాకర్ సిద్ధమవుతాడు. మరి చివరికి అస్లాం మధీని పట్టుకున్నాడా? మధీ ఉప్పు అందించడానికి ప్రయత్నించిన హ్యాకర్ ఎవరు? ఈ సినిమాలో మరో విక్రమ్ పాత్ర ఏమిటి? అసలు ఎలా ఇలా మర్డర్లు చేయగలిగాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.


విశ్లేషణ:
కోబ్రా సినిమాని విశ్లేషించాలి అంటే ఈ సినిమాని గతంలో డిమోంటి కాలనీ, సీబీఐ వంటి తమిళ సినిమాలు తెరకెక్కించిన అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద ఆసక్తి పెంచడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ ఆద్యంతం కూడా చూస్తున్న ప్రేక్షకులు ప్రతి సీన్ కి థ్రిల్ ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే క్రమంలో కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోనే కొంత లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆ ల్యాగ్ ఫీలింగ్ డబల్ అవుతుంది. చెప్పాల్సిన కథను నేరుగా చెప్పకుండా తికమక పెట్టినట్టు అనిపిస్తుంది. అలాగే రెండో భాగంలో అనవసరపు సీన్లు ఎక్కువగా ఉండడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగాల్సింది పోయి అసహనం పెరిగే అవకాశాలు ఉంటాయి. మొదటి భాగం అంతా కూడా రెండో భాగం మీద సస్పెన్స్ పెంచే విధంగా ప్లాన్ చేసుకున్నా దర్శకుడు రెండో భాగాన్ని డెలివరీ చేయడంలో తడబడ్డాడు. రెండో భాగంలో రివీల్ చేసిన ఫ్లాష్ బ్యాక్ ముందే రివీల్ చేసి ఉంటే సినిమా మరింత ఆసక్తి పెంచేదేమో అనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ సినిమా టాక్ మీద ఖచ్చితంగా పడుతుంది.  సినిమాల్లో కొన్ని లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. ఆ ఎఫెక్ట్ సినిమా మొత్తం మీద పడుతుందని చెప్పక తప్పదు. అయితే అలాంటి లాజిక్ లెస్ సీన్లు పక్కనపెడితే వన్ టైం వాచబుల్ మూవీ. 


నటీనటులు:
నటీనటులు విషయానికి వస్తే ఈ సినిమాలో మధీ అలాగే ఖదీర్ అనే రెండు పాత్రలలో విక్రమ్ తనదైన నటన చూపించాడు. మరీ ముఖ్యంగా ఖదీర్ గా ఉండాల్సిన వ్యక్తి మధీగా పేరు మార్చుకుని ఒక లెక్కల మాస్టర్ గా బతుకుతూ మర్డర్లు చేస్తూ హెల్యూసినేషన్ అనే ఒక జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిగా తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు విక్రమ్. ఇక విక్రమ్ తరువాత ఎక్కువగా స్క్రీన్ స్పేస్ దొరికింది ఇర్ఫాన్ పఠాన్ కే చెప్పాలి. మొదటి సినిమా కావడంతో ఎక్స్ప్రెషన్స్ పలికించడంలో ఇర్ఫాన్ పఠాన్ కాస్త తడబడ్డాడు. కాకపోతే ఉన్నంతలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అని చెప్పక తప్పదు. ఇక శ్రీనిధి శెట్టి కూడా తనదైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక ఇతర పాత్రధారులు తమ పాత్ర పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు.
 
సాంకేతిక వర్గం విషయానికి వస్తే 
టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు రాసుకున్న కథ- కథనం విషయంలో ఇంకా జాగ్రత్త వహించాల్సింది. చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే కానీ దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో కాస్త తడవడినట్లు అనిపించింది. ఇక ఈ సినిమా సినిమాటోగ్రాఫర్లు భువన్ శ్రీనివాసన్, హరీష్ కన్నన్ సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. అదే విధంగా సినిమాకు రెహమాన్ అందించిన సంగీతం అంత హైలైట్ అవలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ గా నిలుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సింది. బాగా ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలగకుండా కొన్ని సీన్లు కత్తిరించుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 


ఫైనల్ గా 
కోబ్రా అనేది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే అందరు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని చెప్పలేం. పండగ రోజు ఫ్యామిలీలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమాని ఒకసారి చూసేయొచ్చు.


Also Read: Gautham Birthday: నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా.. ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటా: మహేష్ బాబు


Also Read: Malayalam Hero in Mahesh film: ఏకంగా మళయాళ హీరోను రంగంలోకి దించుతున్న త్రివిక్రమ్.. అసలు ప్లాన్ అదే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి