Malayalam Hero in Mahesh film: ఏకంగా మళయాళ హీరోను రంగంలోకి దించుతున్న త్రివిక్రమ్.. అసలు ప్లాన్ అదే?

Malayalam Hero Roshan Mathew roped in Mahesh Trivikram film: త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా కోసం ఒక మళయాళ హీరోను రంగంలోకి దించనున్నారని టాక్ వినిపిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2022, 07:35 AM IST
Malayalam Hero in Mahesh film: ఏకంగా మళయాళ హీరోను రంగంలోకి దించుతున్న త్రివిక్రమ్.. అసలు ప్లాన్ అదే?

Malayalam Hero Roshan Mathew roped in Mahesh Trivikram film: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న దాదాపు అన్ని సినిమాల్లోనూ హీరోలతో సమానంగా విలన్ పాత్ర లేదంటే సినిమాలో రెండో హీరో పాత్ర పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాల్లో అదే సీన్ రిపీట్ అవుతూ వస్తోంది. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నవీన్ చంద్ర, అలవైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ వంటి వారిని నటింపజేశారు.

ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాలో లవర్ బాయ్ తరుణ్ ని కూడా నటింప చేస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం మీద తరుణ్ క్లారిటీ ఇచ్చారు కూడా,. తనను ఈ విషయం మీద ఎవరూ సంప్రదించలేదని ఏదైనా అధికారికం అయితే కనుక తానే ప్రకటిస్తానని ఆయన మీడియాకు ఒక నోట్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు మలయాళ సినీ పరిశ్రమకు చెందిన రోషన్ మాథ్యూ అనే హీరోని మహేష్ బాబు సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

2015వ సంవత్సరంలో నటుడిగా తెరంగ్రేటం చేసిన రోషన్ మాథ్యూ పుతియా నియమం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత అనేక సినిమాలు చేసి మలయాళంలో హీరోగా నిలదొక్కుకున్నారు. తాజాగా ఆయన విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. అలాగే నాని నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆయన హీరోగా నటించి, మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన కప్పేల అనే సినిమాని తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ కూడా చేస్తున్నారు.

ఈ సినిమా రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కొనుక్కుంది. అయితే ఆ విషయం మీద ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ విశ్వక్సేన్ ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నాడని ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పుడు మలయాళ హీరోని మహేష్ బాబు సినిమాల్లో తీసుకున్నారు అని తెలియడంతో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారని అంచనాలు వెలబడుతున్నాయి. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరగబోతోంది అనేది.

Also Read: Cobra Movie Twitter Review: అన్నీ పాజిటివ్ రివ్యూలే.. కానే అదే పెద్ద మైనస్ అంటున్నారే?

Also Read: Shreya Dhanwanthary Hot Photos: ఒక రేంజ్ లో రెచ్చిపోయిన తెలుగమ్మాయి శ్రేయ ధన్వంతరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News