Comedian Bharti Singh Supports Sreerama Chandra: తెలుగు బిగ్ బాస్ షో(Bigg Boss 5 Telugu) రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లో కూల్ గాయ్ గా పేరు తెచ్చుకున్న సింగర్ శ్రీరామంచంద్ర(Singer Sreerama Chandra)కు బయట ఫాలోయింగ్ మామూలుగా లేదు. అతడికి సపోర్టు చేయాలని పలువురు సెలబ్రెటీలు సైతం కోరుతున్నారు. ఇక ఈ మధ్యే బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌(Payal Rajput) కూడా శ్రీరామ్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందీలో ఇండియన్‌ ఐడల్‌ షో(Indian Idol) విన్నర్‌గా నిలిచాడు శ్రీరామ్. ఉత్తరాదిలో కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్న ఇతడు...తెలుగు వారికి చేరువకాలేకపోయాడు.  ఆ ఆశను నెరవేర్చుకోవడానికి బిగ్‌బాస్‌ షోను సాధనంగా మార్చుకున్నాడీ సింగర్‌. అలా బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్నాడు. అనవసరంగా తగాదాలు పెట్టుకోకుండా, ఒకవేళ ఎవరైనా కావాలని తగవు పెట్టుకున్నా చిరునవ్వుతోనే సమాధానమిస్తూ మిస్టర్‌ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. కండ బలంతోపాటు బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తూ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా తనను తాను నిరూపించుకుంటున్నాడు.


Also Read: Manchu Manoj: మనోజ్‌ రెండో పెళ్లి..నన్ను కూడా పిలవండంటూ మంచు హీరో సెటైర్!


తాజాగా శ్రీరామ్‌ కోసం రంగంలోకి దిగిందో పాపులర్‌ కమెడియన్‌. శ్రీరామచంద్రకే ఓటేయండంటూ వీడియో చేసింది. 'నా ఫ్రెండ్‌ శ్రీరామచంద్ర తెలుగు బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్నాడు. అతడికి ఇదే నా బెస్ట్‌ విషెస్‌.. దయచేసి అందరూ శ్రీరామ్‌కే ఓటేయండి' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన శ్రీరామ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అతడికి సపోర్ట్‌ చేసినందుకు భారతీ సింగ్‌(Bharti Singh)కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook