Manchu Manoj: హీరో మంచు మనోజ్ త్వరలో రెండోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఓ విదేశీ యువతిని ఆయన పెళ్లి చేసుకోనున్నారని కొంతమంది చెబుతుండగా..లేదు సమీప బంధువుల అమ్మాయితో వివాహం నిశ్చయమైందని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై తాజాగా మంచు మనోజ్(Hero Manchu Manoj) స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పేశారు.
ఓ వెబ్సైట్ మనోజ్ రెండో పెళ్లి(Manchu Manoj second marriage) గురించి వార్త రాయగా..''‘దయచేసి.. నన్ను కూడా పెళ్లికి పిలవండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ చేస్తున్నారు? ఆ బుజ్జి, తెల్ల పిల్ల ఎవరు?! మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం!!’’''అని మనోజ్ ట్వీట్(Manoj Tweet) చేశారు. దీంతో మనోజ్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టత వచ్చింది.
https://t.co/HntEosyeYv please invite me too … where is the wedding and who is that Bujji pilla Thella pilla ?! 😜😂 me istam ra anthaaa me istam 🤪 pic.twitter.com/q8nKADpxxf
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 26, 2021
Also read: Jr NTR: సంజయ్ లీలా భన్సాలీతో జూ. ఎన్టీఆర్ మూవీ..ఇక ఫ్యాన్స్ కు పండగే..!
హైదరాబాద్‌కు చెందిన ప్రణతీరెడ్డితో 2015లో మనోజ్ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2019లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఆనాటి నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘‘'అహం బ్రహ్మాస్మి'(aham brahmasmi movie) ’ చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో మనోజ్ విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook