హైదరాబాద్: శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) మాజీ చైర్మన్, టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్‌కు ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. అటు సినిమాల పరంగా, రాజకీయాల పరంగానూ కాస్త ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనదైనశైలిలో కామెడీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు కమెడియన్ పృధ్వీ. అయితే భక్తి ఛానల్‌లో మహిళా సిబ్బందితో అసభ్యకరంగా మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో వైరల్ కావడంతో ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనపై ఎంక్వయిరీ కూడా జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో 30 ఇయర్స్ పృధ్వీకి సంబంధించి మరో బాధాకర విషయం వెలుగుచూసింది. భారీ సినిమా ప్రాజెక్టులో అవకాశం కోల్పోయారట. అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో తొలుత పృధ్వీకి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం జరిగిందట. హర్షవర్దన్ చేసిన పాత్రకు పృధ్వీనే న్యాయం చేస్తాడని అనుకున్నా కొన్ని కారణాలతో అది సాధ్యం కాలేదు.


Also Read: మహిళతో నటుడు పృథ్వీరాజ్ రొమాంటిక్ టాక్.. ఆడియో వైరల్!


గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద థర్టీ ఇయర్స్ పృధ్వీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రాజెక్టులో ఛాన్స్ ఇవ్వకముందే ఈ కమెడియన్‌ను పక్కన పెట్టేశారట. కామెడీ యాంగిల్ సహా నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రకు హర్షవర్ధన్‌ను తీసుకున్నారు. హర్ధవర్దన్ తన టైమింగ్‌తో ఆకట్టుకుని మంచి మార్కులే కొట్టేశాడు. కానీ అటు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి రాజీనామా చేయడం, కీలక ప్రాజెక్టు సినిమా ఛాన్స్ పోయిందని ప్రచారం కావడంతో పృధ్వీకి పరిస్థితులు అనుకూలంగా లేవని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.


Also Read: నటుడు పృధ్వీపై ఆరోపణలు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన టీటీడీ


అయితే చాలా అనుభం ఉన్న కమెడియన్ కావడంతో పృధ్వీ మళ్లీ సినిమాల్లో రాణిస్తారని, ఆయనపై మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణల్లో వాస్తవం త్వరలో తేలుతుందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బన్నీ లేటెస్ట్ సినిమాలో పృధ్వీకి అవకాశం పోవడంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..