సినిమా పేరు: నారాయణ & కో  
యాక్టర్స్: సుధాకర్‌ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్‌, ఆమని, పూజ కిరణ్‌, సప్తగిరి తదితరులు
ప్రొడ్యూసర్: పాపిశెట్టి బ్రదర్స్‌, సుధాకర్‌ కోమకుల
డైరెక్టర్: చిన్నా పాపిశెట్టి
మ్యూజిక్ డైరెక్టర్స్: సురేశ్‌ బొబ్బిలి, డాక్టర్‌ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్
రిలీజ్ డేట్: జూన్‌ 30 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Narayana and Co Movie Review and Rating: లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు హీరో సుధాకర్ కోమకుల. తాజాగా సరికొత్త మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. చిన్నా పాపిశెట్టి దర్శకత్వంలో రూపిందించిన నారాయణ & కో నేడు (జూన్ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా..? రివ్యూ ఎలా ఉంది..? ఓసారి పరిశీలిద్దాం..


కథ ఏంటి..?


నారాయణ (దేవి ప్రసాద్‌), జానకి (ఆమని) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన భార్యాభర్తలు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా వర్క్ చేస్తుండగా.. పెద్ద కుమారుడు ఆనంద్‌ (సుధాకర్‌ కోమకుల) క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మరోవైపు క్రికెట్ బెట్టింగ్ అంటే అతనికి పిచ్చి. ఇలా బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకుని రూ.10 లక్షల అప్పు చేస్తాడు. నారాయణ చిన్న కొడుకు చిన్న కొడుకు సుభాష్‌ (జై కృష్ణ) కెమెరామెన్‌గా వర్క్ చేస్తుంటాడు. ఓ చావు ఇంట్లో ఫొటోలు తీసేందుకు వెళ్లిన సుభాష్‌.. అక్కడే ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోను గుర్తు తెలియని వ్యక్తి తీసి.. రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్‌ చేస్తానని అంటాడు. ఇటు నారాయణ పని చేసే బ్యాంకులో 25 లక్షల రూపాయలు చోరీకి గురవుతుంది. ఈ దొంగతనాన్ని బ్యాంక్ మేనేజర్ నారాయణ మీదకు మోపుతాడు. రూ.25 లక్షలు బ్యాంక్‌లో జమ చేయాలని.. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు. 


నారాయణతోపాటు ఇద్దరు కొడుకులకు కూడా డబ్బులు అవసరం అవ్వడంతో ఎవరినైనా కిడ్నాప్ చేయాలని అనుకుంటారు. నారాయణ మేనకోడలు నళిని (పూజా కిరణ్‌)తో కలిసి ఓ కిడ్నాప్‌కి ప్లాన్‌ చేస్తే.. అది ఫెయిల్ అవుతుంది. మరోవైపు పాలిటిక్స్‌లో వచ్చేందుకు రౌడీ శంకర్‌ (తోటపల్లి మధు) రెడీ అవుతాడు. ముంబైలో ఉన్న ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. కోటి రూపాయలు ఇస్తామని నారాయణ కుటుంబానికి ఆఫర్ ఇస్తాడు. ఈ డీల్‌కు ఒప్పుకున్న నారాయణ & కో.. ముంబైకి వెళ్లి పిల్లి బొమ్మను తీసుకువచ్చిందా..? అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది..? ఆ పిల్లి బొమ్మలో ఏముంది..? నారాయణ బ్యాంక్‌లో డబ్బులు ఎత్తుకెళ్లింది ఎవరు..? సుభాష్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోంది ఎవరు..? ఎస్‌ఐ అర్జున్‌ (అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే నారాయణ & కో మూవీని చూడాల్సిందే..


మూవీ ఎలా ఉంది..?


మధ్య తరగతి కుటుంబాలకు ఎప్పుడు ఆర్థిక కష్టాలు ఉంటాయి. అయితే స్థాయికి మించి ఆర్థిక సమస్యలు ఎదురైతే.. వాటి నుంచి ఎలా కుటుంబం మొత్తం కలిసి ఎలా బయటపడ్డారనేది నారాయణ & కో మూవీ స్టోరీ. ట్యాగ్ లైన్ ది తిక్కల్ ఫ్యామిలీకి తగినట్లే.. సినిమా కథనం సాగుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్లు ఇప్పటికే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంటాయి.  
నారాయణ కుటుంబం పరిచయంతో సినిమా మొదలవుతుంది. హీరోహీరోయిన్లు పబ్‌లో మీట్ అవుతారు. ఆ తరువాత హీరోయిన్ ప్రెగ్నెంట్‌ అయ్యానని చెప్పడం.. వెంటనే పెళ్లి చేసుకోవడం జరిగిపోతుంది. కొన్ని సీన్లు కన్విన్సింగ్‌గా అనిపించకపోయినా.. కామెడీ సన్నివేశాలు మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి. ద్వితీయార్ధం కాస్త రొటీన్‌గా సాగినా.. ప్రేక్షకులను నవ్వించడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సినిమాలో సాంగ్స్ ప్లేస్‌మెంట్ సరిగా ఉన్నట్లు అనిపించదు. 


ఎవరు ఎలా నటించారు..?


క్యాబ్ డ్రైవర్ ఆనంద్‌ పాత్రలో సుధాకర్‌ చాలా బాగా యాక్ట్ చేశాడు. తన డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకులను మెప్పిస్తాడు. హీరో తమ్ముడిగా నటించిన జైకృష్ణ తన నటనతో అలరించాడు. దేవీ ప్రసాద్‌, ఆమని ఫుల్‌ లెంగ్త్ కామెడీ రోల్స్‌ ప్లే చేశారు. నారాయణగా దేవీ ప్రసాద్‌, జానకిగా ఆమని ఆడియన్స్‌ను ఫుల్‌గా నవ్విస్తారు. మూవీలో వీరిద్దరికి స్క్రీన్‌ స్పెస్‌ దక్కింది. ఎస్‌ఐ పాత్రలో అలీ రెజా, ప్రీతిగా ఆర్తిలు తమ పాత్రలు పరిధి మేర యాక్ట్ చేశారు.  సప్తగిరి కామెడీ పెద్దగా వర్కౌట్‌ అయినట్లు కనిపించదు. మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సాంగ్స్, మ్యూజిక్ సినిమాకు కాస్త ప్లస్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకే అనిపిస్తుంది. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగినట్లు ఉన్నాయి. కామెడీ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నారాయణ & కో తప్పకుండా నచ్చుతుంది. 


రేటింగ్: 2.75/5


Also Read: Rajanna Sircilla Family Death: సిరిసిల్ల జిల్లాలో ఘోర విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య  


Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి