ముంబై:  ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అయితే మహిళలు శృంగారానికి సంబంధించిన విషయాలు, కోరికలపై స్పందిస్తే ఈమెను లైన్‌లో పెడదామని, ఆ సెక్స్ పరమైన కోణంలోనే ఆమె గురించి ఆలోచిస్తారని నటి అన్వేషి జైన్ అంటోంది. గందీ బాత్ 2 ఫేమ్ అన్వేషి జైన్ టాలీవుడ్ ఎంట్రీ సినిమా కమిట్మెంట్‌పై పలు విషయాలు షేర్ చేసుకుంది.  Ram charan అరుదైన ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమిట్మెంట్ సినిమా విషయానికొస్తే నేను సెక్సాలజిస్ట్‌ పాత్ర పోషించారు. అందులో నా పేరు డాక్టర్ రేఖా గుప్తా. జిమ్‌లో నాకంటే వయసులో చిన్నవాడైన ఓ ట్రైనర్‌తో ప్రేమలో పడతాను. అతడితో నేను ఏం మాట్లాడతాను, ఎలా వ్యవహరిస్తాననే విషయాలపై సినిమా నడుస్తుంది. అయితే వాస్తవానికి అక్కడ మీరు చూసేది ఒకటి, దాని వెనుక కారణాలు, నిజనిజాలు మరోలా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కుతోంది. తన కుటుంబం, పని పట్ల ఆమె ఎంతగా శ్రమిస్తుంది, ఆమె మనస్తవం ఏంటన్నది సినిమాలో చూడవచ్చని నటి అన్వేషి జైన్ వివరించింది.  కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


గందీ బాత్ 2 వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్న అన్వేషి జైన్ త్వరలో కమిట్మెంట్ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. ఆమె పలు గుజరాతీ సినిమాల్లోనూ నటించింది. హైదరాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు, పరిచయం లాంటి సినిమాలు తెరకెక్కించిన లక్ష్మీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కథ కూడా ఆయనే అందించడంతో సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos


తేజస్వీ మడివాడ, అమిత్ తివారీ, రమ్య పసుపులేటి, అభయ్ రెడ్డి, సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్, సిమర్ సింగ్, తనిష్క్ రాజన్, అన్వేషి జైన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఫుట్ లూస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌, ఎఫ్3 ప్రొడక్షన్స్ పతాకంపై బల్దేవ్ సింగ్ నీలిమాలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ