Conflict between Mahesh and Trivikram: ​సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిగా సర్కారు వారి పాట అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో ఆయన సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఊహించిన మర అంచనాలను అందుకోలేకపోయింది కానీ కమర్షియల్ గా బాగానే వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి త్రివిక్రమ్ ఎన్టీఆర్తో సినిమా చేయాల్సి ఉంది కానీ ఏమైందో ఏమో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకుని మరీ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా సంబంధించిన ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది కానీ మహేష్ బాబు తల్లి మరణించడంతో ఆ షెడ్యూల్ అనూహ్యంగా వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తోంది.


ఇప్పటికే రెండవ షెడ్యూల్ షూటింగ్ పూర్తి ప్రారంభించాలి కానీ మహేష్ బాబు విదేశాలకు వెళ్లడంతో అది వాయిదా పడింది. ప్రస్తుతం మహేష్ బాబు విదేశాల నుంచి తిరిగి రావడంతో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య కొంత దూరం ఏర్పడిందనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు ఈ సినిమా విషయంలో ఆనందంగా లేడని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పూర్తి ఎఫర్ట్ ఈ సినిమా మీద పెట్టడం లేదని మహేష్ బాబు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.


పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధంగా లేని కథను వినడం తన తప్పేనని ఇప్పుడు మహేష్ భావిస్తున్నారని ఎలాగో ఒప్పుకున్నా కాబట్టి, సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది కాబట్టి ఎలాగోలా సినిమా పూర్తి చేసి విడుదల చేసేందుకే మహేష్ బాబు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి. రాజమౌళి టీమ్ ఈ సినిమా కోసం పని చేయబోతోంది.


Also Read: Andrea Jeremiah Hot Photos: మైగాడ్ అనిపిస్తున్న ఆండ్రియా.. ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయిందిగా!


Also Read: Samantha – Chaitanya’s meeting: హాస్పిటల్ కు చైతూ.. చూడగానే సమంత.. అసలు విషయం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook