Samantha – Chaitanya’s meeting: హాస్పిటల్ కు చైతూ.. చూడగానే సమంత.. అసలు విషయం ఏంటంటే?

Samantha – Chaitanya’s meeting: తన మాజీ భార్య సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకున్న వెంటనే నాగచైతన్య ఆమెను ఓదార్చేందుకు ఇంటికి వెళ్లారని ప్రచారం జరుగుతున్న క్రమంలో అసలు నిజం మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 3, 2022, 10:12 AM IST
Samantha – Chaitanya’s meeting: హాస్పిటల్ కు చైతూ.. చూడగానే సమంత.. అసలు విషయం ఏంటంటే?

Truth behind Samantha – Chaitanya’s meeting: గత కొన్నాళ్లుగా హీరోయిన్ సమంత తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ విషయం మీద సమంత స్వయంగా ప్రకటన జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. తాను మయోసైటిస్ అనే ఒక ఆటో యూనియన్ తో బాధ పడుతున్నానని త్వరలోనే దీని నుంచి కోలుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే ఇది చాలా అరుదుగా వచ్చే ఒక అరుదైన ప్రాణాంతక వ్యాధి అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాక ఆమె మాజీ భర్త ఒకప్పటి ప్రియుడు నాగచైతన్య ఆమెను హాస్పిటల్ కి వెళ్లి కూడా పరామర్శించారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ దానికి సంబంధించిన విజువల్స్ కానీ ఫోటోలు కానీ ఎక్కడా బయటికి రాలేదు. అయితే మీడియాలో సోషల్ మీడియాలో మాత్రం నాగచైతన్య విషయం తెలియగానే సమంత దగ్గరికి వెళ్లి ఓదార్చారని నాగచైతన్యను చూడగానే సమంత వెంటనే ఒక్క ఉదుటున వెళ్లి హగ్ చేసుకుందాని కూడా ప్రచారం జరిగింది.

కానీ అసలు అందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. నిజానికి సమంత ప్రస్తుతానికి హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం లేదని, ఆమె ప్రస్తుతానికి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటుందని తెలుస్తోంది. తన వ్యాధిని బయటపెడుతున్న సమయంలో ఆమె షేర్ చేసిన ఫోటోలో కూడా ఇంటి నుంచే చేతికి సిలైన్ పెట్టుకుని మరోపక్క డబ్బింగ్ వరకు కూడా పూర్తి చేస్తున్నట్లు ఉన్న విషయాన్ని సమంత అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన సమంత ఇంటికి నాగచైతన్య వెళ్లడం వెళ్లి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పడం నిజం కాదని తెలుస్తోంది.

సమంత ప్రస్తుతానికి ఒకపక్క రెస్ట్ తీసుకుంటూనే మరో డబ్బింగ్ వర్క్స్ తో బిజీగా ఉంటే నాగచైతన్య మరో పక్క తమిళ తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న తన 22వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కిస్తున్నారు. 

Also Read: Pawan Kalyan: పవన్ వెంట అనుమానాస్పద వ్యక్తులు.. కారు, బైక్లపై ఫాలో అవుతూ అర్ధరాత్రి పంచాయితీ?

Also Read: Sreemukhi Latest Photos: రోజు రోజుకీ రెచ్చిపోతున్న శ్రీముఖి.. పద్ధతైన బట్టల్లో కూడా క్లీవేజ్ షో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News