Rajamouli revelaed Update on Baahubali Part-3: బాహుబలి-1, బాహుబలి- 2.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాలు. ప్రభాస్ ద్విపాత్రాభినయం, రానా, అనుష్క మరియు తమన్నా ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వచించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా సునామీ సృష్టించగా.. రాజమౌళి ఇపుడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలెక్షన్ ల పరంగా అదరగొట్టిన ఈ సినిమాపై బాహుబలి పార్ట్ - 3 కూడా రానుందని చాలా రోజులుగా సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన రాధేశ్యామ్ ప్రమోషన్ లలో భాగంగా దీనిపై హీరో ప్రభాస్ కూడా చిన్న క్లూ ఇచ్చేసాడు. ఈ వార్తలపై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందిస్తూ.. "బాహుబలి పార్ట్-3 గురించి నాకు కూడా ఎలాంటి వార్త లేదు.. కానీ టైం వస్తే జరగొచ్చు" అని హింట్ ఇచ్ఛేసాడు. ఇది వినగానే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 


ఇదిలా ఉండగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి కూడా దీనిపై క్లూ ఇవ్వటంతో బాహుబలి-3 సినిమా రాబోతుందని సినీ ప్రేక్షకులు చెవులు కొరుక్కుంటున్నారు. 


ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా..  రాజమౌళి ఓ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. "బాహుబలి-1, బాహుబలి-2 తీశారు.. అవి పెద్ద హిట్ అయ్యాయి.. మరీ బాహుబలి-3 ఆశించవచ్చా..??" అని యాంకర్ అడగ్గా.. "తప్పకుండా ఆశించవచ్చు. బాహుబలి చుట్టూ జరిగే ఇతర కథనాలను చూపించే పనిలో ఉన్నాము.. మా నిర్మాత శోభు యార్లగడ్డ గారు కూడా దీనికి అనుకూలంగా స్పందించటంతో దానిపై వర్క్ చేస్తున్నాం. ఇప్పుడే రాకపోవచ్చు కానీ.. భవిష్యత్తులో దీనికి సంబందించిన వార్త మాత్రం తప్పక వస్తుంది" అని రాజమౌళి తెలిపారు.  రాజమౌళి నోట ఈ మాట విన్న ప్రేక్షకులు మాత్రం తెగ సంతోష పడిపోతున్నారు. బాహుబలి పార్టీ 3 కోసం ఎదురుచూస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 


ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 


Also Read: Telangana Jobs: తెలంగాణలో మొదలు కానున్న ఉద్యోగాల జాతర, పోలీస్ శాఖ నుంచే ప్రారంభం


Also Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టులో నేడు విచారణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook