Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకై శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపధ్యంలో సర్వం సిద్ధమవుతోంది. ముందుగా పోలీసు శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ ప్రారంభం కానుంది.
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. పోలీస్ శాఖ నుంచే తొలి ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. జోన్ల వారిగా ఉద్యోగాల ఖాళీల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కసరత్తు మొదలు పెట్టింది. ఈనెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటివారంలో ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ శాఖలో దాదాపు 18వేలకు పైగా ఖాళీలున్నట్లు గుర్తించారు. ఉద్యోగాలకు సంబంధించి శాసన సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమైయ్యాయి. ఖాళీల చిట్టాను సిద్ధం చేస్తున్నారు. ఉద్యోగ ప్రకటన చేయడానికి ఇతర శాఖలకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖ నియామక ప్రకటన చేయాలంటే ముందు టెట్ నిర్వహించాల్సి ఉంటుంది.
2018లో పోలీస్ శాఖ 16 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో ఎంపికైన వారి శిక్షణ పూర్తి కాగానే మరోమారు భారీ స్థాయిలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. త్వరలోనే పోలీస్ శాఖలో భర్తీలు పూర్తి చేస్తామని ఇటీవల హోంమంత్రి ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే నియామక మండలి సిద్ధమైంది. కొత్త జిల్లాలు, జోన్ల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది. గత ఏడాది జూలైలోనే నియామకాలకు సంబంధించి ప్రకటన వస్తుందని భావించింది. చివరి నిమిషంలో ఉద్యోగ ప్రకటన వాయిదా పడింది. తాజాగా సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో నోటిఫికేషన్ రానుంది.
Also read: Mallu Ravi: కొల్లాపూర్ 'మన ఊరు-మన పోరు' సభలో మల్లు రవి వార్నింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook