Custody Collections: రెండో రోజు దారుణంగా పడిపోయిన కస్టడీ కలెక్షన్స్
Custody Movie 2 Days Total Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా కస్టడీ అనే సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్ అనేది ఒకసారి పరిశీలిద్దాం.
Custody Movie 2 Days Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా తాజాగా కస్టడీ అనే సినిమా రూపొందింది. తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో ఈ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీ శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. నిజానికి ఈ శుక్రవారం నాడు ఈ సినిమా తెలుగు సహా తమిళ భాషల్లో విడుదలైంది.
అయితే దురదృష్టవశాత్తు సినిమాకి డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా పెద్దగా ప్రభావం అయితే చూపించడం లేదు. కస్టడీ సినిమా రెండు రోజులు తెలుగు రాష్ట్రాల వసూళ్లు పరిశీలిస్తే చాలా దారుణమైన వసూళ్లు నమోదయ్యాయి. మొదటి రోజు కోటి 82 లక్షల షేర్ వసూలు చేస్తే రెండో రోజు కేవలం 80 లక్షల మాత్రమే వసూలు చేసింది. వీకెండ్ లో శనివారం కూడా 80 లక్షలు మాత్రమే వసూలు చేసింది అంటే ఇది ట్రేడ్ వర్గాల వారు ఈ సినిమాకి పెద్ద దెబ్బగానే అభివర్ణిస్తున్నారు.
Also Read: Chatrapathi Remake: దారుణంగా హిందీ ఛత్రపతి కలెక్షన్స్.. బొక్కబోర్లా పడ్డారుగా!
మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులకు గాను రెండు కోట్ల 62 లక్షల షేర్, 4 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండో రోజు ఏరియాల వారీగా వసూళ్లు పరిశీలిస్తే కనుక నైజాం ప్రాంతంలో 27 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 10 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో తొమ్మిది లక్షలు, ఈస్ట్ గోదావరి 8 లక్షలు, వెస్ట్ గోదావరి ఆరు లక్షలు, గుంటూరు ఎనిమిది లక్షలు, కృష్ణాజిల్లా ఎనిమిది లక్షలు, నెల్లూరు జిల్లా నాలుగు లక్షలు వెరిసి రెండు తెలుగు రాష్ట్రాలకు గాను 80 లక్షలు, మొదటి రెండు రోజు వసూలు చేసింది.
ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి 11 లక్షలు ఓవర్సీస్ లో 80 లక్షలు తమిళంలో 15 లక్షలు వెరసి మూడు కోట్ల 68 లక్షల షేర్, 7 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 24 కోట్లకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 25 కోట్లు నిర్ణయించారు. ప్రస్తుతానికి ఈ సినిమా హిట్టు కొట్టాలంటే ఇంకా 21 కోట్ల 32 లక్షలు వసూలు చేస్తే గాని అది హీట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
Also Read: Ruhani Sharma Photos: వైట్ స్లీవ్ లెస్ టాప్లో సెగలు రేపుతున్న రుహానీ శర్మ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook