Sonakshi Sinha: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్... ఎందుకంటే?
Sonakshi Sinha news: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
Sonakshi Sinha news: ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది. చీటింగ్ కేసులో (fraud case) సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది మొరాదాబాద్ కోర్టు.
అసలేం జరిగిందంటే...
ఢిల్లీలో ఓ ఈవెంట్ కోసం మొరాదాబాద్‌లోని కట్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ప్రమోద్ శర్మ అనే వ్యక్తి సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. దాని కోసం ముందుగానే ఆమెకు రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. దీంతో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ప్రమోద్ కోరాడు. అందుకు సోనాక్షి మేనేజర్ నో చెప్పాడు. సోనాక్షిని సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అతడు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశాడు.
ఈ కేసులో సోనాక్షిపై ఫిబ్రవరి 2019లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు నమోదైన తర్వాత తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు సోనాక్షి సిన్హా 14 ఆగస్టు 2019న మొరాదాబాద్‌కు వచ్చారు. ఓ హోటల్లో రెండు గంటల పాటు బస చేసిన తర్వాత తన స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసుకున్నాడు. అయితే తర్వాత పదే పదే ఆమె గైర్హాజరు అవుతుండటంతో..సోనాక్షిపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ (non bailable warrant) జారీ చేసింది స్థానిక కోర్టు. ఈ నటి త్వరలో 'ఫాలెన్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.
Also Read: Radhe Shyam First Review: రాధేశ్యామ్ రివ్యూ.. భారత్‌లో ప్రభాస్‌ను బీట్ చేసేవాళ్లే లేరు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook