Daggubati Donation for Floods: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు.. గత కొద్ది రోజులుగా వరదలు వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో కురిసిన వర్షం.. అక్కడి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. వారం రోజులపాటు.. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇంకా అక్కడ కొన్ని కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో అక్కడి ప్రజలకు..ఆహారం, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నిత్యావసరాలను అందించాలని.. వరద బాధితులు కోరడంతో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ కార్డు లేనివారికి కూడా ఆధార్‌ కార్డు ఆధారంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు.. వచ్చిన వరదల వల్ల తెలంగాణ ప్రజలు ప్రాణాలు అరచేత్తో పట్టుకు జీవించారు. ఇక వరద భాదితులను.. ఆదుకునేందుకు సినిమా సెలబ్రిటీస్ ఎంతోమంది ముందుకు వచ్చారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయక నిధులకు.. భారీగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే . ఇక ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవుతూ.. తాజాగా హీరో వెంకటేష్, రానా దగ్గుపాటి కూడా తమ వంతు సహాయం చేశారు. ముందుగా హీరో వెంకటేష్ రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి.. ఆయన రూ. 1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఇదే విషయాన్ని రానా, వెంకటేష్ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. ‘వరదల వల్ల నష్టపోయిన బాధితులని.. చూసి మా హృదయం తల్లడిల్లుతోంది. ఈ ఆపద సమయంలో..చేపట్టిన సహాయక కార్యక్రమాల కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధులకు రూ.కోటి విరాళంగా మేము ప్రకటిస్తున్నాము. అత్యవసరంలో వున్న వారికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాం. మనం కలిసి పునర్నిర్మాణం చేద్దాం. మరింత దృఢంగా ఆవిర్భవిద్దాం,’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు 
వెంకటేష్ దగ్గుబాటి , రానా దగ్గుబాటి.


ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ.. మైత్రి మూవీ మేకర్స్ రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 50లక్షలు విరాళం  ప్రకటించారు.


Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్‌ రావు స్ట్రాంగ్‌ వార్నింగ్‌


Also Read: KCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్‌ విరాళం.. కేటీఆర్‌, కవితతో సహా అందరూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter