Darshan: జైల్లో చిప్పకూడు తినలేకపోతున్నాను.. ఇంటి భోజనం కావాలంటూ కోర్టుకెక్కిన దర్శన్..
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్.. తన అభిమాని రేణుకా స్వామిని చంపిన కేసులో జైలు జీవితం గడుపుతున్నాడు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా తాను జైలు తిండి తినలేకపోతున్నాను. తనకు ఇంటి భోజనం కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు.
Darshan: దర్శన్ పేరు హీరో అయినా.. నిజ జీవితంలో విలన్ గా మారి తన అభిమాని హత్యకు కారకుడయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. అంతేకాడు రిమాండ్ ఖైదీగా కర్ణాటకలోని పరప్పన అగ్రహారంలో ఉంచారు. అక్కడ దర్శన్ జైలు జీవితం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో జైల్లో పెట్టే తిండితో తన ఆరోగ్యం పాడైపోతుందని .. తనకు రోజు ఇంటి భోజనం తెప్పించుకునేలా అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాడు దర్శన్. నిత్యం పరప్పన అగ్రహారం జైలు మెనులో ఉదయం ఉప్మాతో పాటు మధ్యాహ్నం అన్నం, కూర, సాంబారు తో పాటు రాగిముద్ద మరియు మజ్జిగను రెగ్యులర్ గా ఇస్తూ ఉంటారు. దర్శన్ కు ఇందులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు.
హీరోగా ప్రతి రోజు కాస్ట్లీ ఫుడ్ తినే దర్శన్.. జైల్లో అతనికి అందరితో పాటే సామాన్య భోజనం తింటున్నారు. దీంతో తన బరువు దాదాపు 10 కిలోలకు పైగా తగ్గిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈయన ప్రతి రోజు జిమ్ తో పాటు నిత్యం మాంసాహారం తీసుకోవడం అలవాటు. కానీ జైల్లో కేవలం రెండు రోజులు మాత్రమే నాన్ వెజ్ పెడుతున్నారు. అది దర్శన్ కు ఏ మాత్రం చాలడం లేదనే వాదన వినిపిస్తోంది.
జైలు రూల్స్ ప్రకారం ఎంత మేరకు పెట్టాలో అంత మేరకే అక్కడ భోజనం అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ఇంటి భోజనం కోరుతూ కోర్టు కెక్కారు దర్వన్. త్వరలో కోర్టు కూడా దర్శన్ పిటిషన్ స్వీకరించి ఈ విషయమై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఒక నేరస్థుడికి వారి సామాజిక హోదాను బట్టి కాకుండా.. అందరితో సమానంగానే చూడాలనేదే నేర, న్యాయ చట్టాల్లో ఉంది. అపుడే ఖైదీల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇకపై ఎలాంటి నేరాలు చేయకూడదనే నిర్ణయానికి వాళ్లు వస్తారు. ఒక రకంగా జైల్లు అనేవి నేరస్థులను సమస్కరించే కేంద్రాలు కావాలని కానీ.. వారి హోదాను బట్టి ఎవరికి బడితే వారికి అనుమతులు ఇచ్చుకుంటూ పోతే .. నేరస్తులను జైల్లో పెట్టి ఏం లాభం అని కొంత మంది నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
Also read: Mumbai Red Alert: వరద గుప్పిట్లో ముంబై, రానున్న 24 గంటల్లో జల ప్రళయం విరుచుకుపడనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook