Srikanth Odela: సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్న శ్రీకాంత్ ఓదెల.. అమ్మాయి ఎవరో తెలుసా?
Srikanth Odela Marriage News: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటగా ఆయన తాజాగా పెళ్లి పీటలు ఎక్కాడు.
Srikanth Odela Marriage News: ఈ మధ్యకాలంలో సుకుమార్ శిష్యులందరూ వరుస సినిమాలతో ఆకట్టుకుంటూ ముందుకు వెళుతున్నారు. ముందుగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు గురువుకు ఏ మాత్రం తీసి కోబోమని నిరూపించుకున్నారు. ఇక ముఖ్యంగా సుకుమార్ శిష్యుడిగా శ్రీకాంత్ ఓదెల అయితే తెలుగు దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. ఇక శ్రీకాంత్ తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతోంది అని చర్చ జరుగుతున్న సమయంలో ఆయన సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎవరిని వివాహం చేసుకున్నాడు అనే విషయమై క్లారిటీ లేదు కానీ తన సొంత ప్రాంతమైన గోదావరిఖని కరీంనగర్ జిల్లాలో ఆయన వివాహ వేడుక సైలెంట్ గా జరిగింది.
Also Read: Rashmika Mandanna: వేదాంతం మాట్లాడుతున్న రష్మిక.. భలే చెప్పింది బాసూ!
ఈ వేడుకకు సుకుమార్ దంపతులతో పాటు సుకుమార్ శిష్యులు అందరూ హాజరైనట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతానికి వేరే హీరోతో సినిమాలు చేయడం లేదని పుష్ప 2 షూటింగ్లో సుకుమార్కి సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన వివాహం జరగడంతో కొన్నాళ్లపాటు పుష్ప 2 షూటింగ్ కి కూడా బ్రేక్ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇక ఆయన వివాహం చేసుకున్న యువతి గురించి అయితే ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీకాంత్ ఓదెల అఖిల్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ విషయం మీద ఇప్పటివరకు అధికారికంగా అయితే ఎలాంటి సమాచారం లేదు. అఖిల్ యూవి క్రియేషన్స్ బ్యానర్ల కాంబినేషన్లో ఒక కొత్త దర్శకుడుని పరిచయం చేస్తూ ఒక సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి శ్రీకాంత్ ఓదెల ఎవరితో సినిమా చేయబోతున్నాడు? అనే విషయమేదో స్వయంగా ఆయన క్లారిటీ ఇస్తే తప్ప ఈ ప్రచారానికి బ్రేకులు పడే అవకాశం అయితే కనిపించడం లేదు.
Also Read: Priya Prakash Photos: బీచ్లో ప్రియా ప్రకాష్ వారియర్ అందాలు.. చూసి తట్టుకోగలమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK