Nani Dasara Movie First Review: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాని కెరియర్లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడం పూర్తిస్థాయి డీ గ్లామర్ లుక్ లో నాని కనిపించడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 30వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదలవుతోంది. శ్రీరామనవమి రోజునే రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నాని ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ రిలీజ్ అయిపోయింద. ఎప్పటికప్పుడు దుబాయిలో సినిమా చూసి సెన్సార్ కాపీ నుంచే రివ్యూ ఇస్తూ ఉండే ఉమైర్ సందు ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఇచ్చేశాడు.


దసరా సినిమా ఒక పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్ అని నాని పాన్ ఇండియా లెవెల్ లో కొత్త ఆట మొదలుపెట్టాడని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా మొత్తాన్ని నాని తన భుజస్కందాల మీద నడిపించాడని సినిమా మొత్తం మీద ఆయనే కనపడతాడని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాక నాని అవార్డు విన్నింగ్ లెవెల్ లో నటించాడని ఆయన అన్నారు.


ఇక కీర్తి సురేష్ ఈ సినిమాలో ఒక బాంబులాగా కనిపిస్తోందని, ఆ స్టైల్లో ఆమె పర్ఫామెన్స్ ఉందని ప్రశంసలు వర్షం కురిపించాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ అలాగే స్టెంట్స్ కూడా ఫస్ట్ లెవెల్ లో ఉన్నాయని ఇది ఈ పుష్ప 2.0 కొత్త వర్షన్ లాగా అనిపిస్తోందని ఆయన తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూనే ఐదు మార్కులకు గాను మూడున్నర మార్కులు తాను వేస్తున్నట్టుగా రేటింగ్ కూడా ఇచ్చేశాడు. దీంతో నాని దసరా సినిమా మీద తెలుగు ప్రేక్షకులలో అంచనాల అంతకంతకూ పెరుగుతున్నాయి.
Also Read: Actor Innocent death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. స్టార్ కమెడియన్ మృతి


Also Read: Akanksha Dubey Suicide: హోటల్ గదిలో ఉరేసుకున్న స్టార్ హీరోయిన్.. పవర్ స్టార్ పవన్ తో చివరి సాంగ్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook