Malayalam actor Innocent death: తన పాత్రల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలను నవ్వించిన ప్రముఖ నటుడు ఇన్నోసెంట్ కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. రెండు వారాల నుంచి ఆయన అనారోగ్యంతో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది చివరికి ఆయన ఆదివారం రాత్రి 10.30 గంటలకు మరణించారు.
ఇన్నోసెంట్ మాజీ పార్లమెంటు సభ్యుడు కూడా, గతంలో ఆయన కేరళ నుంచి ఎంపీగా పని చేశారు. 600 కి పైగా సినిమాల్లో నటించిన ఇన్నోసెంట్ మలయాళ సినిమా పరిశ్రమలోనే ఒక గొప్ప హాస్యనటులగా పేరు తెచ్చుకున్నారు. ఇన్నోసెంట్ విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, కేరళలోని త్రిస్సూర్ యాసలో డైలాగ్ డెలివరీ ఇన్నోసెంట్ ప్రత్యేకత. సత్యన్ అంతిక్కడ్, ఫాసిల్, ప్రియదర్శన్, సిద్ధిక్-లాల్ వంట ఇన్నోసెంట్ పాత్రలు చాలా ప్రాచుర్యం పొందాయి.
ఇక ఆయన పార్థివ దేహం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎర్నాకులం కడవంట్రలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో, మధ్యాహ్నం 1 నుంచి 3.30 గంటల వరకు ఇరింగలకుడ మున్సిపల్ టౌన్ హాల్‌లో, ఆ తర్వాత ఆయన నివాసంలో ప్రజా సందర్శనార్థం ఉంటుంది. సాయంత్రం 5:00 గంటలకు సెయింట్ థామస్ కేథడ్రల్ చర్చిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. న్నోసెంట్ ఫిబ్రవరి 28, 1948న ఇరింగలకుడలో తేకెతల వారిత్ మరియు మార్గలీత దంపతులకు కుమారుడిగా జన్మించారు.
లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ హై స్కూల్, నేషనల్ హై స్కూల్, డాన్ బాస్కో S.N.H లో ఆయన దువుకున్నారు. 8వ తరగతితో చదువు ఆపేసిన ఇన్నోసెంట్ నటన మీద ఆసక్తితో మద్రాసు వెళ్లారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన దర్శకుడు మోహన్ ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇన్నోసెంట్ మొదటి చిత్రం 1972లో విడుదలైన నిరిత్సాల. ఆ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూసుకోలేదు, ఆయన సినీ తారల సంఘం అమ్మకు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు భార్య ఆలిస్. కొడుకు సొనెట్ ఉన్నారు.
Also Read: Akanksha Dubey Suicide: హోటల్ గదిలో ఉరేసుకున్న స్టార్ హీరోయిన్.. పవర్ స్టార్ పవన్ తో చివరి సాంగ్?
Also Read: Dasara Business: దుమ్మురేపిన నాని దసరా ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook