Dasara Story line Leaked: నాని హీరోగా దసరా అనే పాన్ ఇండియా మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నాని కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా చెబుతున్న ఈ సినిమాని మార్చి 30వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని ఏకకాలంలో విడుదల చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడం ఈ సినిమా మీద భారీ నమ్మకం ఉండడంతో నాని అన్ని ప్రాంతాలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ చాలా కాలం తర్వాత సంగీతం అందించిన ఈ సినిమాకి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వాహబ్, సాయి కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.


సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో గోదావరిఖని ప్రాంతంలో జరిగిన కథగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య 2 కథకు దగ్గరగా ఉందని అంటున్నారు. అయితే పూర్తిగా ఆర్య 2 కథ కాదు కానీ ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే అంశం మీద ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


ఆర్య 2 పూర్తిగా ఎమోషన్స్ తోనే ఎంటర్టైన్మెంట్ మోడ్ లో  సాగితే ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిందని అంటున్నారు. పూర్తిస్థాయి తెలంగాణ యాసలో మాట్లాడుతూనే నాని ఇప్పటికే సినిమా మీద అంచనాలు పెంచేశారు. దసరా కథ హీరో, హీరో స్నేహితుడు, హీరోయిన్ మరియు విలన్ అనే 4 ప్రధాన పాత్రల మధ్య ముడిపడి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా హీరో స్నేహితుడి పాత్ర సినిమాకు చాలా కీలకమని, అతని పాత్ర చుట్టూ ఉండే ఎమోషనల్‌ కనెక్షన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.


Also Read: 'Natu Natu': ఢిల్లీ చాందిని చౌక్ వ‌ద్ద నాటు నాటుకి స్టెప్పులేసిన‌ జ‌ర్మ‌న్ అంబాసిడర్


Also Read: Corona Returns: H3N2 టెన్షన్లో ఉండగానే మరో బాంబు.. నాలుగు నెలల తరువాత ఒక్కరోజులో వెయ్యికి పైగా కేసులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook