David Warner about Pushpa 2: సినీ ప్రముఖులకు, క్రికెటర్లకు మంచి అనుబంధం ఉన్నది. చాలామంది సోషల్ మీడియా ద్వారా భారీగానే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా పలు రకాల సినిమాలలో పాటలకు రీల్స్ డాన్సులు చేస్తూ అటు సినిమాలకు హైప్ పెంచడమే కాకుండా తమకు భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి వారిలో ప్రముఖ క్రికెటర్  డేవిడ్ వార్నర్ కూడా ఒకరు. పుష్ప సినిమాలోని కొన్ని డైలాగ్ లకు ,పాటలకు రీల్స్ చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. వీటివల్ల పలు సినిమాలలో కూడా నటించేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కూడా గతంలో వినిపించాయి. 


అంతేకాకుండా పుష్ప సినిమాకి సంబంధించి కొన్నిటిని షేర్ చేస్తూ ఉంటారు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా పుష్ప-2 సినిమాకి సంబంధించి ఇటీవలే ట్రైలర్ కూడా నిన్నటి రోజున పాట్నాలో చాలా గ్రాండ్ గా విడుదలయ్యింది. ట్రైలర్ రిలీజ్ అనంతరం డేవిడ్ వార్నర్ తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కి  కంగ్రాట్యులేషన్స్ చెబుతూ గ్రేట్ వర్క్ బ్రదర్ అంటూ ప్రశంసలు కురిపించారు. 


పుష్ప-2 ట్రైలర్ చూసి ఈ విషయాన్ని చెప్పడంతో అటు క్రికెట్ అభిమానులే కాకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా డేవిడ్ వార్నర్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. 
డేవిడ్ వార్నర్, అల్లు అర్జున్ కూడా ఎన్నోసార్లు ఒకరికొకరు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతమైతే డేవిడ్ వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ కామెంట్స్ వల్ల అభిమానులకు మరింత బూస్ట్ ఇచ్చేలా కనిపిస్తోంది.


పుష్ప-2 ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా అల్లు అర్జున్ నటనని , సుకుమార్ క్రియేటివిని మెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమా కచ్చితంగా రికార్డు బ్రేక్ చేస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి అభిమానులను మెప్పించిన పుష్ప-2 ట్రైలర్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.


Also read: Air Pollution: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు నిరవధిక సెలవు, ఎందుకంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.