Dead Body at Thalapathy Vijay's Office : తమిళ నాట స్టార్ హీరోగా ఉన్న ఇళయ దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తమిళనాట అజిత్,  విజయ్ కు మధ్య ఉన్న పోటీ మరే హీరోకు లేదని చెప్పాలి. రజనీకాంత్-కమల్ హాసన్ తరువాతి తరంలో అంతటి క్రేజ్ దక్కించుకున్నది విజయ్,  అజిత్ మాత్రమే. ఈ మధ్యనే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఇప్పుడు అనూహ్యంగా వార్తలోకి ఎక్కాడు. విజయ్ కి సంబందించిన ఆఫీస్ లో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది.  విజయ్ కి చెన్నై శివార్లలోని పనైయుర్ లో ఓ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ నుంచి విజయ్ తాను చేయాలనుకున్న సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యనే విజయ్ అభిమానులు అందరూ కలిసి 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' అనే ఒక రాజకీయ వేదికను ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఆఫీసును 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' కార్యక్రమాల కోసం సిద్ధం చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే ఈ ఆఫీసును కొంచెం పెయింట్లు వేయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాకరన్ అనే వ్యక్తి పెయింట్ కాంట్రాక్టర్ గా పనులు చేయిస్తున్నారు. ఇటీవల పనుల నుంచి విరామం తీసుకున్న ప్రభాకరన్ తన ఫ్యామిలీని కలిసేందుకు సొంత ఊరు వెళ్లి వచ్చాడు. అయితే అక్కడి నుంచి గురువారం రాత్రి వచ్చిన ప్రభాకరన్ ఫూటుగా మద్యం సేవించినట్లు తెలుస్తోంది. 


అలా మద్యం మత్తులోనే వెళ్లి ఆఫీస్ సూపర్ వైజర్ ని పరోటా తినాలి నాకు 100 రూపాయలు ఇవ్వమని అడిగాడట. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు,  ఆయన ఎప్పుడు వచ్చాడో కూడా ఎవరూ చూడలేదు. కానీ శుక్రవారం ఉదయం చూసే సరికి ప్రభాకరన్ అనుమానస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు.  ఇక ఆ సమయంలో ప్రభాకరన్ నోట్లో కొరికిన పరోటా ముక్క,  చేతిలో మిగిలిన పరోటా అలాగే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ప్రభాకరన్ ఆకలితో ఆ పరోటాను ఒక్కసారిగా తినడానికి ప్రయత్నించి ఉంటాడని,  అయితే ఆ సమయంలో ఊపిరి ఆడకపోవడంతో ఆయన అక్కడికక్కడే మరణించి ఉంటాడని ప్రాధమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 


అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. ఇక విజయ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చినప్పుడు విజయ్ కేసీఆర్ ను కలిసేందుకు వెళ్ళడంతో ఆయన రాజకీయ ఎంట్రీ గురించి చర్చ మొదలయింది. 
Also Read: Vikram : ఐదేళ్లకు బాహుబలి రికార్డు బద్దలు కొట్టిన తమిళ సినిమా.. కానీ?


Also Read: Actor Murderd : యువ నటుడి దారుణ హత్య.. భార్య మరణించిన నెలల వ్యవధిలోనే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook