Dear Krishna: పీఎన్ బీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న  చిత్రం ‘డియర్ కృష్ణ’. ఈ చిత్రాన్ని పూర్తి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా ఈ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్డ్రీకి పరిచయం కాబోతున్నారు.  ఈ మూవీకి దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేస్తున్నారు. ‘డియర్ కృష్ణ’ చిత్రంతో అక్షయ్ కొత్త అబ్బాయి టాలీవుడ్ చిత్ర సీమకు హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో  ‘ప్రేమలు’ చిత్రంతో పరిచయమైన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. వీరితో పాటు ఐశ్వర్య కూడా మరో కథానాయికగా నటిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజ జీవిత సంఘటల నేపథ్యంలో ఈ సినిమాను  పీఎన్ బలరామ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా కథను రాసుకున్నారు.గుండెను   బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకృష్ణున్నే నమ్మే ఒక భక్తుడు  ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఒక అద్భుతం జరిగింది. ఇలాంటి అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరక్కిస్తున్నారు. నమ్మలేని నిజాలు కాదు ఎవరూ ఊహించలేని కథతో పాటు స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రాబోతుంది.  ఆ భగవంతుడు శ్రీ కృష్ణుని దయతోనే ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాత పీఎన్ బలరామ్ చెప్పుకొచ్చారు.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఈ చిత్రం ఎంతో మంది ప్రజల జీవితాలకు స్పూర్తి వంతంగా ఉంటుందన్నారు. ఇదే సమయంలో యూత్ ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. ఇప్పటి యూత్ అభిరుచికి తగ్గట్టుగానే ఈస్టోరీని  తెరకెక్కించినట్లు డైరెక్టర్ దినేష్ బాబు తెలిపారు. విజయ దశమి సందర్భంగా ‘డియర్ కృష్ణ’ చిత్రం పోస్టర్ విడుదల చేసారు.  త్వరలో టీజర్, ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నట్టు చెప్పుకొచ్చారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter