ఈ ఫొటోలలో ఉన్న సొట్టబుగ్గల సుందరిని మీరు గుర్తుపట్టారా?
Guess Who is The Heroine in this Picture: పైన కనిపించిన ఫొటోల్లో ఓ బేబి గర్ల్ ఉంది. ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది. తనకు నచ్చిన ప్రియుడ్ని పెళ్లాడి.. అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఆ పాప ఎవరో మీకు ఇంకా గుర్తు రాలేదా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే!
Deepika Padukone Unseen Childhood Photos: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి భారతీయ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతుంది. ఇప్పటికీ మీరు గుర్తించలేకపోతే మీకోసం ఒక క్లూ ఇస్తాను. ఆ స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'ప్రాజెక్టు-కే' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్ గా పరిచయం అయ్యేందుకు సిద్ధమైంది. అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా ఆ సినిమాలో నటిస్తోంది.
[[{"fid":"219202","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
నాకు తెలిసి ఇప్పటికీ మీరు కనిపెట్టేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. అవును, ఆమె ఎవరో కాదు బాలీవుడ్ కు చెందిన సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొణె. నేడు (జనవరి 5) ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవెంటో మీరు కూడా చూసేయండి.
[[{"fid":"219203","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
1986లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన దీపికా పదుకొణె.. నటనపై మక్కువతో మోడలింగ్ చేసింది. ఆ తర్వాత అనేక బ్రాండ్ల ప్రచార కార్యక్రమాల్లో నటిస్తూ.. సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. 'ఐశ్వర్య' అనే చిత్రంతో తొలిసారి హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.
[[{"fid":"219205","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఆ తర్వాత వెంటనే ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో! అతనెవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ఆయన హీరోగా నటించిన 'ఓం శాంతి ఓం' చిత్రంతో దీపికా పదుకొణె హీరోయిన్ గా హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాతో హిట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె.. సినీ రంగంలో ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
[[{"fid":"219206","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
ఆ తర్వాత వరుస చిత్రాలతో ఫ్యాన్స్ ను అలరించిన దీపికా పదుకొణె.. లవ్ ఎఫైర్లతో తరచూ వార్తల్లో నిలిచేది. తొలుత హీరో రణ్ బీర్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమైనట్లు పుకార్లు జోరు అందుకున్నాయి. ఏమైందో ఏమో తెలియదు కానీ, అంతలోనే వీరు విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్ మాల్యా, క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపించాయి.
[[{"fid":"219208","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
కానీ, కొన్నేళ్ల తర్వాత మరో హీరో రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో పడినట్లు బాలీవుడ్ లో ఊహాగానాలు వినిపించాయి. ఆ రూమర్లను నిజం చేస్తూ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమె డేటింగ్ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లైంది. ఇప్పుడు రణ్ వీర్ సింగ్, దీపిక కలిసి అనేక చిత్రాల్లో నటిస్తున్నారు. దీపికా పదుకొణె కూడా ప్రభాస్ సరసన 'ప్రాజెక్టు-కే'లో నటిస్తోంది. దీంతో పాటు మరో నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది ఈ సొట్టబుగ్గల సుందరి.
Also Read: Harnaaz Sandhu NYC Apartment: న్యూయార్క్ లోని మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు ఇల్లు చూశారా?
Also Read: Radhe Shyam Postponed: RRR బాటలో రాధేశ్యామ్- సినిమా రిలీజ్ వాయిదా వేసిన చిత్ర యూనిట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.