Harnaaz Sandhu NYC Apartment: న్యూయార్క్ లోని మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు ఇల్లు చూశారా?

Harnaaz Sandhu NYC Apartment: ఇటీవలే జరిగిన మిస్ యూనివర్స్ 2021లో విజేతగా నిలిచిన భారతీయురాలు హర్నాజ్ సంధు.. ఇప్పుడు అమెరికాకు మకాం మార్చింది. విశ్వసుందరిగా కిరీటం సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు న్యూయార్క్ లో ఓ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 06:39 PM IST
    • అమెరికాకు మకాం మార్చిన మిస్ యూనివర్స్
    • న్యూయార్క్ లో అపార్ట్ మెంట్ కొనుగోలు హర్నాజ్ సంధు
    • మోడలింగ్ లో ఎదుగుదల కోసమే అమెరికా వెళ్లినట్లు సమాచారం
Harnaaz Sandhu NYC Apartment: న్యూయార్క్ లోని మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు ఇల్లు చూశారా?

Harnaaz Sandhu NYC Apartment: భారత యువతి హర్నాజ్ సంధు మిస్​ యూనివర్స్​-2021 కిరీటాన్ని దక్కించుకుంది. గతేడాది డిసెంబరులో ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్​కు ఈ టైటిల్ దక్కింది.

మోడలింగ్ రంగంలో మరింతగా ఎదిగేందుకు ఇప్పుడామె న్యూయార్క్ కు వెళ్లింది. అక్కడ ఓ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్ట్గాగ్రామ్ లో షేర్ చేసింద హర్నాజ్ సంధు. 

అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హర్నాజ్ సంధు ఇండియాలోని చండీగఢ్‌కు చెందిన యువతి.

ఇప్పటివరకు 1994లో సుస్మితా సేన్‌, 2000లో లారా దత్తాతో కలిసి భారత్‌ రెండుసార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2021లో హర్నాజ్ సంధు విశ్వసుందరిగా నిలిచింది. 

హర్నాజ్ సంధు.. ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 పోటీలోనూ టైటిల్‌ విజేతగా నిలిచింది. తన మాతృభాష పంజాబీతో పాటు హిందీ, ఇంగ్లీష్ లోనూ నిష్ణాతురాలు ఈమె. 

హర్నాజ్‌ వయసు 21 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేస్తున్నారు.

హర్నాజ్ సంధు.. 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా మోడలింగ్‌లోకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

 

మిస్ యూనివర్స్ 2021లో కిరాటాన్ని దక్కించుకున్న హర్నాజ్ సంధు.. మోడలింగ్ లో మరింతగా రాణించేందుకు అమెరికాకు చేరుకుంది. తాజాగా న్యూయార్క్ లో ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసింది.  

Also Read: Saba Qamar Latest Pics: ఇంటర్నెట్ షేక్ చేస్తున్న పాకిస్తానీ నటి సబా ఖమర్

Also Read: Meena Tested Covid Postive: సినీ నటి మీనా కుటుంబాన్ని చుట్టిన కరోనా మహమ్మారి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News