Deepika padukone: విమర్శించిన నోళ్లతోనే...ప్రశంసలు
Deepika padukone: అవమానాలు..విమర్శలు..అన్నీ ఎదుర్కొని..ఛాలెంజ్‌గా తీసుకోవాలి. విమర్శించిన నోళ్లు మూయించాలి. ఆ నోళ్లతోనే ప్రశంసలు అందుకోవాలి. అదే జరిగింది ఆ నటి విషయంలో..
Deepika padukone: అవమానాలు..విమర్శలు..అన్నీ ఎదుర్కొని..ఛాలెంజ్‌గా తీసుకోవాలి. విమర్శించిన నోళ్లు మూయించాలి. ఆ నోళ్లతోనే ప్రశంసలు అందుకోవాలి. అదే జరిగింది ఆ నటి విషయంలో..
బాలీవుడ్ నటీమణుల్లో( Bollywood ) అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి దీపికా పదుకోన్ ( Deepika padukone ). అందం..అభినయం..మంచితనం మూడూ నిండుగా ఉన్నాయి దీపికాలో. అందుకే బాలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తోంది. హిట్ సినిమాలు, అద్భుత నటనకు లభిస్తున్న ప్రశంసలు ఆమె కీర్తి ప్రతిష్ఠల్ని పెంచాయి.
ఇంతటి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్న దీపికా ( Deepika ) తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాల్ని పంచుకున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది అందరికీ. తొలి సినిమా సమయంలో చాలా అవమానాల్ని ఎదుర్కొంది దీపికా పదుకోన్. నటించడం రాదని..నటనకు పనికి రాదని..చాలా రకాలుగా విమర్శించారని చెప్పుకొచ్చింది. 19 ఏళ్ల వయస్సులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన దీపికా పదుకోన్‌కు తొలి సినిమాలోనే షారుఖ్ ఖాన్ ( Shahrukh khan ) తో నటించే అవకాశం లభించింది. చిత్ర దర్శకురాలు ఫరాఖాన్, షారుఖ్ ఖాన్ సలహాలతో షూటింగ్ పూర్తి చేశానంది.
సినిమా విడుదలయ్యాక డైలాగ్ డెలివరీ బాగా లేదని..నటించడం రాదని వచ్చిన విమర్శలు చూసి మళ్లీ సినిమాల్లో నటించకూడదని అన్పించిందని చెప్పింది. అయితే అవమానాల్ని సవాలుగా స్వీకరించి..తప్పులు సరిదిద్దుకుంటూ విమర్శించిన నోళ్లతో ప్రశంసలు అందుకున్నానని గర్వంగా చెప్పుకుంటుంది ఈ నాజూకు భామ దీపికా పదుకోన్.
Also read: Raviteja: మాస్ కా బాప్ క్రాక్ ట్రైలర్ విడుదల రేపే