Deepika Padukone Tests Covid-19 Positive; బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె బెంగుళూరులోనే తన తల్లి, చెల్లితో కలిసి హోమ్ క్వారంటైన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతకంటే ముందుగా దీపికా పదుకునే తండ్రి ప్రకాశ్ పదుకునె, తల్లి ఉజ్వల పదుకునె, సోదరి అనిషా పదుకునెకు కరోనా సోకినట్టు తేలింది. వాళ్లు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిసింది. తాజాగా వారి నుంచే దీపికా పదుకునెకు కూడా కరోనా సోకినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ ముంబైలో ఉన్నాడా లేక బెంగళూరులో ఉన్నాడా ? అతడి ఆరోగ్య పరిస్థితి ఏంటనేదే ఇంకా తెలియాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకాశ్ పదుకునె (Deepika Padukone's father Prakash Padukune) సన్నిహిత మిత్రుడు విమల్ కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. ''10 రోజుల క్రితమే ప్రకాశ్ పదుకునెకు, ఆయన భార్య ఉజ్వల, కుమార్తె అనిషాకు కరోనా లక్షణాలు కనిపించాయని, కరోనా పరీక్షల్లో వారికి తాజాగా పాజిటివ్ అని తేలింది'' అని అన్నారు. ''అప్పటి నుంచే వాళ్లు ఇంట్లోనే ఐసోలేట్ అవుతున్నారు. అయితే, ప్రకాశ్ పదుకునెకు వారం రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో గత శనివారమే కరోనా చికిత్స కోసం బెంగళూరులోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రకాశ్ పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చింది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రకాష్ పదుకునె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు'' అని విమల్ కుమార్ చెప్పారు. 


Also read : Complete lockdown in India: ఇండియాలో లాక్‌డౌన్ విధించాలి: డా ఆంథోని ఫాసీ


ఇటీవలే దీపికా పదుకునె సోషల్ మీడియా ద్వారా ఈ కరోనా (Coronavirus) సంక్షోభం గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ప్రస్తుతం అందరూ ఒకరకమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారని, కానీ అలాంటిదేమీ అవసరం లేదని చెప్పుకొచ్చింది. అందరం కలిసి ఆశావాద దృక్పథంతో ఈ సమస్యను ఎదుర్కొవాలని దీపికా పదుకునె తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. ఆమె అలా చెప్పడానికి కారణం తన కుటుంబం (Deepika Padukone's family) అంతా కరోనా బారిన పడటమే ఓ కారణం అయి ఉండవచ్చు అని దీపికా అభిమానులు అంటున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook