CT Scan For COVID Patients: సీటీ స్కాన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు, AIIMS డైరెక్టర్ సంచలన విషయాలు

CT Scan For COVID-19 Patients | స్వల్ప లక్షణాలతో ఉన్న కరోనా బాధితులకు, అనుమానితులకు సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఒక్క సీటీ స్కాన్ చేయడం అంటే 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్‌రే చేయడంతో సమానమని, భవిష్యత్తులో క్యాన్సర్‌కు సైతం దారి తీసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 4, 2021, 12:48 PM IST
CT Scan For COVID Patients: సీటీ స్కాన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు, AIIMS డైరెక్టర్ సంచలన విషయాలు

CT Scan For COVID-19 Patients : దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఓ వైపు ప్రజల్లో ప్రాణభయం పెరుగుతుంటే దీనిని ప్రైవేట్ ఆసుపత్రులు అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్న అనుమానితులకు తమకు వీలైనన్ని టెస్టులు, పరీక్షలు చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. కోర్టులు సైతం ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించడం తెలిసిందే.

ఇటీవల కరోనా అనుమానితులకు అధిక మొత్తం నిర్వహిస్తున్న పరీక్ష సీటీ స్కాన్(CT Scan). అతి తక్కువ, స్వల్ప లక్షణాలున్న కరోనా పేషెంట్‌కుగా, కరోనా అనుమానిత వ్యక్తులకు సీటీ స్కాన్ చేయాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోమవారం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. స్వల్ప Covid-19 లక్షణాలతో ఉన్న కరోనా బాధితులకు, అనుమానితులకు సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఒక్క సీటీ స్కాన్ చేయడం అంటే 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్‌రే చేయడంతో సమానమని, భవిష్యత్తులో క్యాన్సర్‌కు సైతం దారి తీసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా యువతలో సీటీ స్కాన్ కారణంగా రేడియేషన్ అధికమై సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పారు. 

Also Read: Covid-19 Vaccine తీసుకున్నాక మూర్ఛ, స్పృహ తప్పడానికి కారణమేంటో చెప్పిన సీడీసీ

సీటీ స్కాన్ ఏం గుర్తిస్తుంది..
ఎక్స్‌రే మెషీన్లను తిప్పుతూ శరీరంలోని భాగాలను కంప్యూటర్ క్యా్ప్చర్ చేస్తుంది. ప్రస్తుతం సీటీ స్కాన్‌ను కరోనా లక్షణాలు అధికంగా ఉన్న వారికి చేసి తీవ్రత, ఇన్‌ఫెక్షన్లను గుర్తిస్తున్నారు. న్యుమెనియా లేదా ఊపిరితిత్తులకు ఉన్న తెల్లని అతుకులను, కరోనా మ్యుటేషన్, తీవ్రతను సీటీ ద్వారా డాక్టర్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ మ్యుటేషన్, వైరస్ ఎంత మేరకు ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తుందో తెలుసుకుంటారు. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులలో గుర్తించలేని కొన్ని విషయాలు తెలుసుకునేందుకు వైద్యులు సీటీ స్కాన్ చేయాలని సూచిస్తున్నారు. 

Also Read: Risk Factors For Covid-19: కరోనా వీరికి సోకితే మరింత ప్రమాదకరం.. ప్రాణాలు కూడా పోతాయి

కరోనా బాధితులలో 30 నుంచి 40 శాతం వ్యక్తులలో ఏ లక్షణాలు లేకున్నా కరోనా(CoronaVirus) పాజిటివ్ అని తేలుతున్న విషయం తెలిసిందే. సీటీ స్కాన్ చేసిన వారిలో దాదాపు అందరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేస్తున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారికి ఎట్టి పరిస్థితులలోనూ సీటీ స్కాన్ చేయడం మంచిది కాదని రణదీప్ గులేరియా తెలిపారు. అంతగా వారికి అవసరం అనుకుంటే ఎక్స్‌రే చేయించాలని సలహా ఇచ్చారు. ఆక్సిజన్ స్థాయి సరిగ్గా ఉండి, ఏ లక్షణాలు లేని కరోనా బాధితులకు సీటీ స్కాన్ చేయాలని డాక్టర్లు సూచించకూడదని అభిప్రాయపడ్డారు.

కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నవారికి సాధారణ మెడిసిన్ ఇవ్వాలని, ప్రారంభదశలోనే అధిక ప్రభావం చూపించే స్టెరాయిడ్స్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. కొన్ని సందర్భాలలో ఆ స్టెరాయిడ్స్ ఇవ్వడంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నారు. కరోనా లక్షణాలు అతి తక్కువగా ఉన్నవారికి రక్తపరీక్షలు అనవసరమని, రెమ్‌డెసివర్, ప్లాస్లా థెరపీ లాంటి అత్యవసర చికిత్సలుగా భావించాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పలు విషయాలు తెలియజేశారు.

Also Read: Cancer Patients: క్యాన్సర్ బాధితులకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News