Deepika Padukone: ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న దీపికా..!
Deepika Padukone Upcoming Movies: ఇతర హీరోయిన్స్ లాగా పుట్టిన బిడ్డకు నానీలను పెట్టకుండా.. తానే స్వయంగా తన బిడ్డను రెండేళ్లపాటు చూసుకోవడానికి.. దీపిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీపిక ఎన్నో సినిమాలు చేయాల్సి ఉండగా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Deepika Padukone Pregnancy: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే వరుసగా చిత్రాలు చేస్తూ భారీ పాపులారిటీ.. సొంతం చేసుకుంది. ఇటీవలే కల్కి 2898AD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో అందంతో అలరించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కల్కి సినిమాలో ఈమె గర్భవతిగా నటించిన విషయం తెలిసిందే.కానీ నిజంగానే తాను గర్భవతి.. ఈ పాత్రలో గర్భవతి గానే నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
దీపికా పదుకొనే , రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఇటీవల ఈమె గర్భవతి అయ్యింది. సెప్టెంబర్ లో తొలి బిడ్డకు జన్మనివ్వనుంది ఈ ముద్దుగుమ్మ. కడుపుతో ఉండి కూడా కల్కి సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొని అందరినీ ఆకర్షించింది. ఇక ఇప్పుడు అభిమానులకు బాడ్ న్యూస్ చెబుతూ ఈమె తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మరికొంతమంది ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈమె తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా ఈమెకు ది వైట్ లోటస్ మూడవ సీజన్లో నటించే అవకాశం రావడంతో రిజెక్ట్ చేసిందట. ఈ సీజన్ మొదలయ్యేసరికి దీపికా డెలివరీ కూడా అయిపోతుంది అయినా సరే నో చెప్పిందట. పుట్టే బిడ్డ కోసం ఈ సీరీస్ ని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొత్త ప్రాజెక్టులకు ఈమె సైన్ చేయడం లేదు అని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీపిక ఎవరి సహాయం లేకుండా తన బిడ్డను చూసుకోవాలని కోరుకుంటోందట..అంటే ఇతర సెలబ్రిటీల లాగా తమ బిడ్డలను చూసుకోవడానికి నానీలను పెట్టుకోకుండా తానే స్వయంగా తన బిడ్డను చూసుకోవాలని నిర్ణయించుకుందట. అందుకే బిడ్డ పుట్టిన తర్వాత 2 ఏళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి , తన బిడ్డతోనే ఎక్కువ సమయాన్ని గడపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇక దీన్ని బట్టి చూస్తే దీపికా సినిమాలు ఇప్పట్లో లేనట్లే అని స్పష్టం అవుతుంది. ఇకపోతే ఈమె తీసుకున్న నిర్ణయానికి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు అంతేకాదు చాలామంది హీరోయిన్స్ తమ బిడ్డలను చూసుకోవడానికి ఆయాలను పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి వారందరికీ గట్టి కౌంటర్ ఇస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి