Jr NTR Donation for Telugu States : దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా స్పందిస్తూ విరాళాలు ప్రకటిస్తూ ఆంధ్ర , తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలవరపాటుకు గురిచేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక రూ.50 లక్షలు విరాళమిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ సహాయానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా మా నటుడు సూపర్,  గొప్ప నటుడు అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


ఎన్టీఆర్ విషయానికి వస్తే.. నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఈయన,  ఆ తర్వాత హీరోగా మారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. 


ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా,  సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించబోతున్నారు.  భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 


ఇదిలా ఉండగా ఇటీవల తన తల్లి షాలిని పుట్టినరోజు సందర్భంగా,  తన తల్లి సొంత ఊరు అయిన కర్ణాటక కుందాపూర్ కి వెళ్లి అక్కడ శ్రీకృష్ణ మఠాన్ని సతీసమేతంగా ఆయన తల్లితో కలిసి సందర్శించారు.  ఇటీవల హైదరాబాద్ కు  చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితులను గమనించిన ఎన్టీఆర్ తక్షణమే కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు.


Also Read: Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌


Also Read: Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter