Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌

Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్‌ పై నుంచి కిందపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 2, 2024, 01:31 PM IST
Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌

Ponguleti Srinivas Reddy: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. మూడు రోజులుగా కుండపోత వర్షాలతో భారీ వరద చేరుకుని ఖమ్మంలోని అన్ని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. మున్నేరు వాగుకు పోటెత్తిన వరదతో ఖమ్మం పట్టణ ప్రజలు జలదిగ్బంధంలోకి చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆలస్యంగా మేల్కొన్న ఖమ్మం ప్రజాప్రతినిధులు సహాయ చర్యల్లో మునిగారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గాయపడ్డారు.

Also Read: No Selfies: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక! జలాశయాల వద్ద సెల్ఫీలు.. ఫొటోలు వద్దు

ఖమ్మం గ్రామీణ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం మంత్రి పొంగులేటి పర్యటించారు. వరదలో మునిగిన బాధితులను పరామర్శించేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. కొద్దిదూరం వెళ్లాక మంత్రి  ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కింద పడి గాయాలపాలయ్యారు. కాలుకు దెబ్బ తగలడంతో వెంటనే సహాయకులు స్పందించి అతడిని కాపాడారు. అనంతరం ఇంటికి చేర్చగా కాలిక గాయమైంది. వెంటనే వైద్యులు పరిశీలించి కాలికి పట్టి కట్టారు.

Also Read: Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసా

గాయాన్ని పరిశీలించిన వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఖమ్మం ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో మంత్రి గాయపడడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. ఖమ్మం వరదలను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించగా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా తమను ఎవరూ పట్టించుకోలేదని నినాదాలు చేశారు. తమను ఆదుకునే వారు లేరని ఆవేదనకు లోనయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News