Harikrishna - Kalyan Ram: నందమూరి హరికృష్ణ వారసుడిగా.. ఇండస్ట్రీలోకి వచ్చిన కళ్యాణ్ రామ్.. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు. ఈ మధ్య విడుదలైన బింబిసార.. సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా సీక్వెల్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ హీరో.. తాజాగా ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. ఈ మాటలు కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన తండ్రికి తనకి మధ్య కొన్ని గొడవలు జరిగాయట. దానివల్ల కొద్ది రోజులు వాళ్ళ మధ్య మాటలు లేవని.. తెలుస్తోంది. అది కేవలం ఒక సినిమాకోసం అంట. ఆ సినిమానే లాహిరి లాహిరి లాహిరిలో. ఈ సినిమా సమయంలో హరికృష్ణకి, కళ్యాణ్ రామ్ కి మధ్య గొడవ జరిగిందట. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు. 


"నేను అప్పుడే కోయంబత్తూర్ లో ఇంజనీరింగ్ చేసి వచ్చాను. ఖాళీగా ఉండేవాడిని. ఆ టైమ్ లో వైవిఎస్ చౌదరి గారు.. ఒకసారి నా దగ్గరకి వచ్చి లాహిరి లాహిరి లాహిరిలో.. సినిమా కథ చెప్పారు. ఇది నాన్న కోసం రాశాను మీరే ఆయనను ఒప్పించాలి అని అన్నారు. అప్పటినుంచి నేను.. నాన్న వెంట పడ్డాను. ఆ సమయంలో నాన్న సినిమాలు చేయడం లేదు. కానీ వైవిఎస్ చౌదరి గారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అందుకే ఒప్పించాలి అనుకున్నాను. మరోవైపు వైవిఎస్ చౌదరి ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తానని అన్నారు. కానీ అసలు అంత డబ్బు పెట్టుకోగలరా.. అని నాన్నకి అనుమానం ఉండేది. కానీ నేను మాత్రం మీరు సినిమా చేయాల్సిందే అని పట్టు పట్టాను." అని అన్నారు కళ్యాణ్ రామ్.


"అప్పటికే నాన్న ఒప్పుకోలేదు. ఒకరోజు వైవిఎస్ చౌదరి గారు వద్దకు.. నేను వెళ్లి ఈ సినిమాని నేనే నిర్మిస్తానని అన్నాను. దీంతో నాన్న భయపడి.. ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను అని హెచ్చరించారు. అప్పుడే.. నాకు నాన్నకి చిన్న గొడవ.. జరిగి కొద్ది రోజులు మాట్లాడలేదు. కానీ ఒకరోజు నాన్నే వచ్చి తాను సినిమా చేయాలంటే.. నేను ఇండియాలో ఉండకూడదు అని అన్నారు. యూఎస్ వెళ్లి చదువు పూర్తి చెయ్యి అన్నారు. అలాగే నాన్న చెప్పినట్టు.. అమెరికా వెళ్లి ఎంఎస్ చేసి, కొంతకాలం జాబ్ కూడా చేసి వచ్చాను" అని అన్నారు కళ్యాణ్ రామ్. ఈ వార్త ఇప్పుడు నందమూరి అభిమానులలో వైరల్ అవుతోంది.


Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. వైఎస్‌ వివేకా హత్యపై కీలక పరిణామం


Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇకపై ఆ నిబంధన ఉండదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి