Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇకపై ఆ నిబంధన ఉండదు..

Grama Ward Sachivalayam Employees Uniform: యూనిఫామ్‌ తప్పనిసరి నియమాన్ని తొలగించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. అంతేకాదు సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు కూడా చేపట్టాలని కోరారు. అంటే మొత్తానికి తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే నియమాలు ఉండాలని కోరారు.

Written by - Renuka Godugu | Last Updated : Aug 7, 2024, 02:40 PM IST
Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇకపై ఆ నిబంధన ఉండదు..

Grama Ward Sachivalayam Employees Uniform: సచివాలయ సిబ్బంది యూనిఫామ్‌కు సంబంధించిన ఓ అప్డేట్‌ వచ్చింది. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు. వారికి ఇక యూనిఫామ్ విషయంలో ఏ ఆంక్షలు ఉండవు. ఆ వివరాలు తెలుసుకుందాం. 

ప్రజల సౌకర్యార్థం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్‌ అమలు చేసింది. మొత్తం అన్ని కేటగిరీలలో మహిళ పోలీసులు, ఏఎన్‌ఎంలు, అసిస్టెంట్లు మినహాయించి అందరికీ యూనిఫామ్‌ అందిచింది. జిల్లా మండట అధికారులు ఈ మేరకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారికి యూనిఫామ్‌ తప్పనిసరి అని ఆంక్షలను విధించవద్దని చెప్పింది. 

యూనిఫామ్‌ తప్పనిసరి నియమాన్ని తొలగించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. అంతేకాదు సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు కూడా చేపట్టాలని కోరారు. అంటే మొత్తానికి తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే నియమాలు ఉండాలని కోరారు. ఈ సమస్యపై కమిటీ వేసి ఉన్నతాధికారులతో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

ఇదీ చదవండి: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలనం.. 900 మందితో పోలీస్‌ భద్రత కావాలని డిమాండ్

అయితే, యూనిఫామ్‌ నిబంధన తప్పనిసరి కాదు అని ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామ, సచివాలయ ఉద్యోగులకు ఫించను పంపిణీ చేసే బాధ్యతను అప్పగించింది. ఈ నేపథ్యంలో వారు జూలై నెల నుంచే పింఛను పంపిణీ చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రం వాలంటీర్లు ఇంటింటికీ పింఛను అందించేవారు. ఆ తర్వాత ఏపీ ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు మంత్రులను కోరుతున్నారు. కానీ, వారికి ఏ బాధ్యతలు అప్పజెప్పాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది.

ఇదీ చదవండి: ఒక కాలిగజ్జె తిరిగిరాని లోకాలకు.. యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రభుత్వానికి గ్రామ, సచివాలయ సిబ్బంది పెట్టుకున్న ఆర్జీ..
రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఆలస్యం అయింది ఈ నేపథ్యంలో వారికి రావాల్సిన బకాయిలను మంజూరు చేయాల్సిందిగా కోరారు. అంతేకాదు వీరికి పదోన్నతులు కూడా ఇవ్వాలి, ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన వెంటనే జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ కల్పించాలని విన్నవించారు. ఇందులో యూనిఫామ్‌ కోడ్‌ నియమం కూడా రద్దు చేయాలని ఉండగా ఓ కొలిక్కి వచ్చింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x