COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jahnvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం జాన్వీ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. బాలీవుడ్‌లో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీతో పలకరించింది. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.


తల్లి ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అయినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. తల్లిలాగే ఇపుడు జాన్వీ దక్షిణాది సినీ పరిశ్రమపై కన్నేసింది. ఈ కోవలో ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈయన హీరోగా కొరటాల శివ దర్శత్వంలో 'దేవర' సినిమాలో నటిస్తోంది. ఈ రోజు జాన్వీ పుట్టినరోజు సందర్భంగా దేవర టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసింది. చీరకట్టులో ఉన్న జాన్వీ లుక్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ఈ యేడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కూడా  రెండు పార్టులుగా తెరక్కుతోంది.






అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ రోజు జాన్వీ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఈ విషయాన్ని కన్ఫామ్ చేసారు. త్వరలో రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమా షూటింగ్‌లో జాన్వీ కపూర్ జాయిన్ కానుంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతో వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ఈమె కూడా గ్లోబల్ లెవల్లో ఫేమస్ అవుతుందా లేదా అనేది చూడాలి. మరి హిందీలో అంతగా కలిసి రాని జాన్వీకి.. తెలుగు సినీ ఇండస్ట్రీ కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook