మూవీ రివ్యూ: దేవర పార్ట్ -1  (Devara Part -1 ): నటీనటులు: ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) , సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, జాన్వీ కపూర్, శృతి మరాటే, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, అజయ్, అభిమన్యు సింగ్, నరేన్ తదితరులు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్ 


సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు 


సంగీతం: అనిరుథ్ రవిచందర్ 


ప్రొడక్షన్ హౌస్: యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ 


నిర్మాతలు:నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ


రచన, దర్శకత్వం: కొరటాల శివ 


విడుదల తేది: 27-9-2024


జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజ్ తర్వాత తారక్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా చూద్దాం.. 



కథ విషయానికొస్తే.. 


ఎర్రసముద్రం, దాని చుట్టూ ఉండే నాలుగు ఊర్లకు దేవర మాటే శాసనం. అక్కడ ఉన్న వారికంత ఆ సముద్రమే జీవనాధారం.  వీరంత సముద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను  కోస్ట్ గార్డ్ కంట పడకుండా.. చేరవేస్తూ ఉంటారు. అయితే తన వాళ్ల కోసం తన ప్రాణాన్నైనా ఇచ్చే అంత ప్రేమ, దైర్యం దేవరకు ఉంటుంది. ఇక అదే ఊళ్ళో ఉందే భైరకు (సైఫ్ అలీ ఖాన్) మాత్రం దేవర చేసే పనులు నచ్చవు. అయితే దేవర సహాయం లేకుండా అక్కడ ఏమీ చేయలేం కాబట్టి.. అతను సరైన సమయం కోసం చూస్తూ ఉంటారు. ఇక కొన్ని పరిణామాల వల్ల తను చేస్తోంది తప్పు అని తెలుసుకున్న దేవర.. ఆ తరువాత నుంచి తాను కానీ.. తన వాళ్లు కానీ సముద్రం లోకి స్మగ్లింగ్ ఇతర ఆయుధాలను దొంగతనంగా తరలించడానికి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. అయితే డబ్బు మీద ఆశ ఉన్న వాళ్లు మాత్రం.. భైరా తోడుగా వెళ్దామని చూస్తారు. అలా వెళ్ళిన వాళ్ళని.. సముద్రానికే బలి ఇస్తుంటాడు దేవర. అయితే ఊరి బాగు కోసం తనపై భయం ఉండేలా ఊరి నుంచి దూరంగా వెళ్లిపోతాడు. అంతేకాదు సముద్రంలో దొంగతనం వెళ్లే వాళ్లే అంతం చూస్తుంటాడు.


 ఇక అంతటి ధైర్యవంతుడికి వర (జూనియర్ ఎన్టీఆర్) లాంటి పిరికివాడు కొడుకుగా ఉంటాడు. అతన్ని రాయప్ప (శ్రీకాంత్) కూతురు తంగం (జాన్వీ కపూర్) ప్రేమిస్తూ ఉంటుంది. మరి దేవరా కొడుకు అయినా కూడా వడ ఎందుకు అంత పిరికివాడు కావడానికి గత కారణాలు ఏమిటి.. ? దేవర అంటే కొడుకైన వరకు పడదు. ఇంటిని విడిచిపెట్టి పోయిన తండ్రి అంటే వరకు ఇష్టముండు.  ఊరికి దూరమైన దేవర.. ఊర్లో వాళ్ళ సమస్యలు పట్టించుకున్నారా లేదా..? అసలు ఆ ఊర్లో ఏమయింది.. ఆ తరువాత జరిగిన కథ ఏమిటి అనేది తెరపైన చూడాల్సిందే.



కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


‘దేవర’ సినిమా చూస్తే.. ఒక రకంగా బాహుబలి సినిమానే సోషలైజ్ చేసి తీసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకు 80, 90 బ్యాక్ గ్రౌండ్ ఎంచుకోవడంతో తొలి సక్సెస్ అందుకున్నాడు. ముఖ్యంగా మత్స్య కారుల జీవితాలను ఈ సినిమాలో ప్రతిబింబించాడు. స్వాతంత్య్రానికి పూర్వం సముద్ర తీరానికి ఆవల నాలుగు గ్రామాలుంటాయి. స్వాతంత్య్రం తర్వాత పనులు లేక వాళ్ల సముద్రంలో దొంగ తనంగా తరలిస్తున్న అక్రమయుధాలను సముద్రం మధ్యలో తమకున్న అనుభవంతో తీసుకొచ్చి స్మగ్లర్స్ కు అప్పగిస్తుంటారు. మొత్తంగా దర్శకుడు ఈ సినిమాను బాహుబలి, ఎర్ర మందారం సినిమాల్లో మెయిన్ పాయింట్ ను తీసుకొని స్వాతంత్య్రం పూర్వం బ్రిటిష్ వారికి ఎదురు తిరిగే మొనగాళ్లు ఆ ఊరివాళ్లు. అయితే హీరో దేవర తనకు అప్పగించిన పనిని పూర్తి చేస్తుంటాడు. కానీ అందులో తరలించేది ఆయుధాలను తర్వాత తెలుసుకుంటాడు. అలా తరలించిన అక్రమాయుధాల వల్లనే తన వాళ్లు కొంత మంది చనిపోవడంతో దేవర  రియలైజ్ అవుతాడు. ఈ ఎపిసోడ్ బాగా పండింది.  ఆ తర్వాత తన ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోని ఓడలపైకి వెళ్లనీయనీయని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ క్రమంలో దేవర అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఈ ఎపిసోడ్ ను ఎర్రమందారం సినిమాను స్పూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఫస్టాఫ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.


దేవర కుమారుడు వర ఎందుకు పిరికివాడిగా చూపించడం వెనక డైరెక్టర్ కొరటాల స్ట్రాటజీ అర్ధమవుతుంది. ఈ సినిమాలో ఫస్టాఫ్ బాగున్నా.. సెకండాఫ్ లో ఇంకాస్త స్పీడ్ పెంచి ఉంటే బాగుండేది. జాన్వీ పాత్ర ఓ పాటకు రెండు మూడు కామెడీ సీన్స్ కు పరిమితమైంది.  క్లైమాక్స్ లో కొరటాల ఊహించిన ట్విస్ట్ ఇచ్చి సెకాండఫ్ పై ఇంట్రెస్ట్ పెంచాడు.
 


మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలను మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాకు తన రీ రికార్డింగ్ తో నిలబెట్టాడు. ఎన్టీఆర్ అభిమానులు కోరుకున్నట్టే ఈ సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోసాడు. మరోవైపు రత్నవేలు ఫోటోగ్రఫీ బాగుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్  నిర్మాణ విలువలు బాగున్నాయి. నైట్ విజన్ ఫోటోగ్రఫీ బాగుంది. కథా రీత్యా  శ్రీకర్ ప్రసాద్ కు తన కత్తెరకు పని చెప్పలేకపోయాడు. అక్కడక్కడ ట్రిమ్ చేసుంటే బాగుండేది. 



నటీనటుల విషయానికొస్తే.. 


ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రకంగా ఒక సినిమాలో తన నటనతో అభిమానులకు డబుల్ కిక్ ఇచ్చాడు. ఒకటి భయపెట్టే పాత్ర అయితే..మరొకటి భయపడే పాత్ర.  ఈ రెండు పాత్రలను ఎంతో ఈజ్ తో మెప్పించాడు. ముఖ్యంగా కళ్లతోనే తన నటనను పలకించాడు. మొత్తంగా సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. తన నటన, డాన్స్ తో పాటు ఫైట్స్ లో అభిమానులను మెప్పించాడు. సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో బైరా పాత్రలో క్రూరత్వం ప్రదర్శించాడు. ఈ పాత్రకు అతను తప్పించి మరొకడు చేయలేడనే రీతిలో మెప్పించాడు.  జాన్వీ కపూర్ ఉన్నంతలో తన క్యూట్ నటనతో మెప్పించింది. అమాయకత్వంతో కూడిన గ్లామర్ పాత్రలో ఒదిగిపోయింది. శృతి మరాఠే  ఉన్నంతలో తన పరిధి మేరకు మెప్పించింది. శ్రీకాంత్, అజయ్, ప్రకాష్ రాజ్ తమ పాత్రలకు న్యాయం చేసారు. 


ప్లస్ పాయింట్స్ :


ఎన్టీఆర్ నటన 


రీ రికార్డింగ్ 


ప్రొడక్షన్ వాల్యూస్ 


మైనస్ పాయింట్స్ :


సెకాండాఫ్ ల్యాగ్ 


లాజిక్ లేని సీన్స్


పంచ్ లైన్.. ‘దేవర’.. ఎన్టీఆర్ టూ మెన్ షో.. 


రేటింగ్ : 3/5


Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల


Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.