Devi Sri Prasad Speech at Pushpa 2 Wildfire Event: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా పుష్ప 2. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వైల్డ్ ఫైర్ ఈవెంట్.. నిన్న చెన్నైలో భారీ స్థాయిలో జరిగింది. వేడుకలో భాగంగా సినిమాకి సంబంధించిన నటీనటులు మాత్రమే కాక చిత్ర బృందం కూడా హాజరైంది. సినిమాకి సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వేడుకలో భాగంగా విడుదలైన కిస్సిక్ పాట కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. అయితే అన్నిటికంటే ఎక్కువగా అందరికీ షాక్ ఇచ్చినది దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన స్పీచ్. ఈ వేడుకలో మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ముఖ్యంగా చిత్ర నిర్మాతలపై దేవి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. 


నిన్న మొన్నటిదాకా పుష్ప 2 సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే పనిచేశారు. కానీ తాజాగా ఈ సినిమా కోసం తమన్, శ్యామ్ అజనీశ్ వంటి వారిని సినిమాకి నేపథ్య సంగీతం అందించడం కోసం రంగంలోకి దింపింది చిత్ర బృందం. దీంతో దేవిశ్రీప్రసాద్ మీద బోలెడు పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మొదలైంది. దీని కారణంగా హర్ట్ అయినా దేవిశ్రీ ఈ వేడుకలో మాట్లాడుతూ నిర్మాతలపై ఫైర్ అయ్యారు. 


కారణం పక్కన పెడితే సంగీత దర్శకుడిని మార్చాలన్న నిర్ణయం నిర్మాతలది కాదు. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకున్న నిర్ణయం అది. ఈ నిర్ణయంలో నిర్మాతల హస్తం చాలా చిన్నది. సినిమాకి కొత్త సంగీత దర్శకుడిని అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకువచ్చారు. కాబట్టి దేవిశ్రీప్రసాద్ ఏమైనా అనాలి అనుకుంటే వాళ్లని అనాలి తప్ప నిర్మాతలని కాదు. 


సుకుమార్, అల్లు అర్జున్ వంటి స్టార్లని అనగలిగే ధైర్యం లేక మాత్రమే.. దేవిశ్రీప్రసాద్ ఇలా సినిమా నిర్మాతల మీద పడి ఏడుస్తున్నారు అంటూ చాలా మంది నెటిజన్లు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. స్టార్ హీరోని ఒక మాట అడగగలిగే ధైర్యం కూడా లేదు కానీ.. సినిమా కోసం బోలెడంత డబ్బులు పెడుతున్న ప్రొడ్యూసర్ల మీద దేవి శ్రీ ప్రసాద్ ఇలా కామెంట్స్ చేయడం ఏమాత్రం బాగోలేదు అంటూ.. ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దేవిశ్రీప్రసాద్ దీనికి రియాక్ట్ అవుతారా లేదా వేచి చూడాలి.


ఇది చదవండి: IPL Mega Auction 2025 Live Updates: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రేటు.. అన్ని రికార్డులు బద్దలు కొట్టిన శ్రేయాస్ అయ్యర్‌


ఇది చదవండి: Ind vs Aus: ఆసీస్‌పై భారీ ఆధిక్యంతో ఇండియా, 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రాహుల్-యశస్వి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.