IPL Mega Auction 2025 Live Updates: సర్వత్రా ఉత్కంఠ.. మరికాసేపట్లో ఐపీఎల్ మెగా వేలం

IPL Mega Auction 2025 Live News: ఐపీఎల్ 2025 మెగా వేలం నేడు, రేపు జరగనుంది. 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ వేలం ప్రారంభంకానుంది. లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 24, 2024, 02:38 PM IST
IPL Mega Auction 2025 Live Updates: సర్వత్రా ఉత్కంఠ.. మరికాసేపట్లో ఐపీఎల్ మెగా వేలం
Live Blog

IPL Mega Auction 2025 Live News: క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 577 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా.. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, షమీ వంటి స్టార్ ప్లేయర్లు వేలంలోకి వస్తుండడంతో భారీ ఆసక్తి నెలకొంది. రూ.25 కోట్ల రికార్డు బ్రేక్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నేడు, రేపు రెండు రోజులపాటు వేలం కొనసాగనుంది. ఈ రోజు వేలంలోకి పంత్, అయ్యర్, అర్ష్‌దీప్‌ రానుండగా.. రెండో సెట్‌లో రేపు కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ పేర్లు ఉన్నాయి. మొత్తం 1574 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. 1000 మంది పేర్లు తొలగించి 574 మంది ఆటగాళ్ల పేర్లు షార్ట్ లిస్ట్ చేశారు. మొత్తం 366 మంది భారత ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం మొదలుకానుంది. ఐపీఎల్ 2025 వేలానికి సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

24 November, 2024

  • 14:33 PM

    IPL Mega Auction 2025 Live Updates: మొదటి రోజు కేవలం 84 మంది ఆటగాళ్లను మాత్రమే వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి 12 సెట్లు మాత్రమే కవర్ చేయనున్నారు. మిగిలిన ప్లేయర్లు సోమవారం వేలం వేయనున్నారు. 

  • 13:19 PM

    IPL Mega Auction 2025 Live Updates: ఒక్కొ ఫ్రాంచైజీ కనీసం 18 మంది ఆటగాళ్లను తీసుకోవాలి. గరిష్టంగా 25 మంది ఆటగాళ్ల వరకు తీసుకోవచ్చు. అన్ని జట్లు కలిపి 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. ఇంకా 204 మంది ప్లేయర్లను వేలంలో తీసుకోనున్నాయి. 

  • 13:05 PM

    IPL Mega Auction 2025 Live Updates: ఐపీఎల్ వేలంలోకి మరో ముగ్గురు ఆటగాళ్ల పేర్లను చేర్చారు. ఇంగ్లాండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌, అమెరికా సీమర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌, ముంబై వికెట్‌ కీపర్‌ హార్దిక్‌ తమోర్‌ వేలంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తం ప్లేయర్ల సంఖ్య 577కి చేరింది.

  • 12:59 PM

    IPL Mega Auction 2025 Live Updates: గత ఐపీఎల్‌కు ముందు ముంబై నుంచి ఆర్‌సీబీకి రూ.17.5 కోట్లతో ట్రేడ్ అయిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఈసారి వేలానికి దూరమయ్యాడు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న గ్రీన్.. కోలుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది.

  • 12:39 PM

    IPL Mega Auction 2025 Live Updates: స్టార్ ప్లేయర్లు 12 మందిని రెండు సెట్స్‌గా విభజించారు. సెట్-1లో జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, కగిసో రబడ, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. సెట్-2లో కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. వీరందరి బేస్ ధరలను రూ.2 కోట్లుగా ఉంది.

  • 12:34 PM

    IPL Mega Auction 2025 Live Updates: అందరి కళ్లు రిషబ్‌ పంత్‌పై ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లు మిచెల్ స్టార్క్ కోసం వెచ్చించగా.. పంత్ ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది.

  • 12:15 PM

    IPL Mega Auction 2025 Live Updates: 10 ఫ్రాంచైజీల పర్స్‌లో ఉన్న డబ్బుల వివరాలు ఇలా.. 

    ==> పంజాబ్ కింగ్స్- రూ. 110.5 కోట్లు
    ==> రాజస్థాన్ రాయల్స్- రూ.41 కోట్లు
    ==> రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ.83 కోట్లు
    ==> ఢిల్లీ క్యాపిటల్స్- రూ.73 కోట్లు
    ==> లక్నో సూపర్ జెయింట్స్- రూ.69 కోట్లు
    ==> గుజరాత్ టైటాన్స్- రూ.69 కోట్లు
    ==> చెన్నై సూపర్ కింగ్స్- రూ.55 కోట్లు
    ==> కోల్‌కతా నైట్ రైడర్స్- రూ.51 కోట్లు
    ==> ముంబై ఇండియన్స్- రూ.45 కోట్లు
    ==> సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ.45 కోట్లు

     

Trending News