Ustaad Bhagat Singh : గబ్బర్ సింగ్‌ను మించేలా.. ఉస్తాద్ కోసం రంగంలోకి దేవి శ్రీ ప్రసాద్
Devi Sri Prasad For Ustaad Bhagat Singh పనవ్ కళ్యాణ్ హరీష్ శంకర్ దేవీ శ్రీ ప్రసాద్ కలిసి చేసిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని మ్యూజిక్, పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతుంటాయి. ఆల్ టైం మ్యూజికల్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది.
Devi Sri Prasad For Ustaad Bhagat Singh మెగా ఫ్యామిలీకి దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరికీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్‌కు అయితే మరుపురాని పాటలిచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డీఎస్పీ రంగంలోకి దిగాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయ్ అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబో అంటేనే మామూలుగా ఉండదు. గబ్బర్ సింగ్ సినిమాలాంటి మరో సినిమాను తీయమని గత కొన్నేళ్లుగా ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రకటించి కూడా చాలా రోజులే అవుతోంది. కరోనా వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో మిగతా ప్రాజెక్టులు అంగీకరించడంతో ఈ సినిమా వెనక్కి వెళ్తూ వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబోలో సినిమా సెట్ అయింది.
ముందుగా తన సొంత కథ రాసుకున్న హరీష్ శంకర్‌కు.. తేరీ రీమేక్ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో తేరీ రీమేక్‌ను తెలుగీకరించేశాడు హరీష్ శంకర్. ఇప్పుడు ఈ సినిమా పాటల కోసం దేవీ శ్రీ ప్రసాద్ రంగంలోకి దిగాడు. 'ఉస్తాద్ భగత్ సింగ్' మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో అరేయ్ సాంబ రాస్కోరా అంటూ గబ్బర్ సింగ్ డైలాగ్ వినిపించింది. ఆ వీడియోలో డీఎస్పీ, హరీష్ శంకర్ ఉత్సాహం చూస్తుంటే 'గబ్బర్ సింగ్'ని మించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ రాబోతోందని అర్థం అవుతోంది.
Also Read: Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్
ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా ఓ షెడ్యూల్ పూర్తయింది. దాని ఎడిటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ లాంటిది వదలబోతోన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఒక వేళ అదే నిజమైతే.. సినిమా మీద అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం. ఈ సినిమాను మైత్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
Also Read: Rajamouli : ఎంత ప్రయత్నించినా లోపలకు వెళ్లనివ్వలేదు.. నాటి ఘటనపై నోరువిప్పిన రాజమౌళి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook