Kalyan Ram - Devil Closing Collections: కళ్యాణ్ రామ్ `డెవిల్` మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. రూ. 21 కోట్ల టార్గెట్.. వచ్చింది ఎంతంటే.. ?
Kalyan Ram - Devil Closing Collections: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలు చేయడంలో ఎపుడు ముందుండే హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కథ నచ్చితే తన ఇమేజ్‌కు సరిపోతుందా లేదా అని డౌట్స్ పెట్టుకోకుండా సినిమాలు చేసే అతికొద్ది మంది హీరోల్లో కళ్యాణ్ రామ్. ఈయన గతేడాది చివర్లో `డెవిల్` మూవీతో పలకరించారు. విడుదలైన వారం లోపే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ మూవీ ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర థియేట్రికల్‌గా ఎంత రాబట్టిందంటే..
Kalyan Ram - Devil Closing Collections: కళ్యాణ్ రామ్ గతేడాది 'అమిగోస్', డెవిల్ మూవీలతో పలకరించారు. ఈ రెండు ప్రయోగాత్మక చిత్రాలు కమర్షియల్‌గా విజయాలు సాధించలేదు. ఇక అమిగోస్ మూవీలో తొలిసారి త్రిపాత్రాభినయంలో కనిపించి ఔరా అనిపించాడు. ఇక 2023 యేడాది చివర్లో 'డెవిల్' మూవీతో పలకరించాడు. ఈ మూవీ టాక్ బాగున్నా.. సలార్ వేడిలో కొట్టుకుపోయింది. ఆ సినిమా చూసిన హ్యాంగోవర్‌లో ఉన్న ప్రేక్షకులు డెవిల్ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ సినిమా టాక్ బాగున్నా.. థియేట్రికల్‌గా పెద్దగా పర్ఫామ్ చేయలేదు.
ఇక బింబిసార తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోయారు. ఇక కళ్యాణ్ రామ్ రీసెంట్ మూవీ 'డెవిల్' మూవీ విషయానికొస్తే..ఇదో పీరియడికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు. ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చుట్టూరా ఈ కథను అల్లారు. అప్పటి కాలానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ కోసం చిత్ర యూనిట్ బాగానే కష్టపడింది. ఓవరాల్‌గా కాన్సెప్ట్ బాగున్నా.. రాంగ్ రిలీజ్ కారణంగా ఈ సినిమా దారుణంగా దెబ్బ తిన్నది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికొస్తే..
రూ. 8.46 కోట్ల షేర్ (రూ. 16.45 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.13 కోట్ల షేర్ (రూ. 20.70 కోట్ల గ్రాస్) వసూళ్లను సరిపెట్టుకుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి కేవలం రూ. 10.13 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 10.87 కోట్ల నష్టాలతో డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతాయనుకున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో కళ్యాణ్ రామ్ మరో సాలిడ్ హిట్ కోసం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook