Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్‌ కాస్కో అంటూ సవాల్‌ విసిరిన హరీశ్‌ రావు

Krishna Projects: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కృష్ణా జలాల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లతో తెలంగాణలో జల యుద్ధానికి తెరలేచింది. రేవంత్‌ రెడ్డి చేసిన సవాల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించి.. అసెంబ్లీలో చూసుకుందామని ప్రతి సవాల్‌ విసిరారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 4, 2024, 08:05 PM IST
Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్‌ కాస్కో అంటూ సవాల్‌ విసిరిన హరీశ్‌ రావు

Harish Rao Challenge: కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారనే అంశం తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విమర్శలపై తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావులకు సంచలన సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌పై హరీశ్ రావు స్పందించారు. చర్చకు సిద్ధం.. అసెంబ్లీలో చూసుకుందామని ప్రకటించారు.

Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడిన మాటలను హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్‌ శివారు ఎల్బీనగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. 'అసెంబ్లీలో చర్చ పెట్టు. ఎప్పుడు పెడతారో పెట్టండి. మేం సిద్ధం. రేవంత్‌ రెడ్డి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం' అని హరీశ్‌ రావు ప్రకటించారు.

Also Read: Medaram Jathara 2024: భక్తులకు అలర్ట్‌.. మేడారం జాతరకు వెళ్తుంటే ఇవి మీ వెంట కచ్చితంగా ఉండాల్సిందే..!

'పదేళ్ల కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో కేంద ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేదు. కృష్ణా నీటిలో 50 శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్‌ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిఓ 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టాం. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ప్రాజెక్టులను అప్పగించి సంతకం పెట్టింది. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టింది. రేవంత్‌ రెడ్డి వద్ద విషయం లేక విషం చిమ్ముతున్నాడు. ఆయనకు ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు' అని హరీశ్ రావు సీఎంపై మండిపడ్డారు.

'పోతిరెడ్డిపాడుపై మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు. ఆనాడు టీడీపీలో ఉన్న రేవంత్‌ పోతిరెడ్డిపాడుపై స్పందించలేదని.. పెదవులు మూతపడ్డాయి. రేవంత్‌ నీ వీపు చూసుకుని మాట్లాడాలి. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది బీఆర్‌ఎస్‌ పార్టీనే. ఆ ప్రాజెక్టుకు బొక్క పెట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు అసెంబ్లీని స్తంభించపేశాం' అని హరీశ్ రావు గుర్తు చేశారు. 'సూర్యుడి మీద ఉమ్మేస్తే నీపైనే పడుతుంది రేవంత్‌ రెడ్డి' అని పేర్కొన్నారు. విషయం లేకనే చవకబారు మాటలు మాట్లాడుతున్నారని, నీ మాటలు టీవీలో చూసే పిల్లలు అసహ్యించుకుంటారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలని, నీకు దిమ్మతిరిగే సమాధానం చెప్తాం బిడ్డా అంటూ తీవ్ర స్థాయిలో రేవంత్‌పై హరీశ్ రావు విరుచుకుపడ్డారు.

ప్రాజెక్టులపై గతంలో తమ ప్రభుత్వం చర్చ పెడితే 'మేం ప్రిపేరై రాలే' అని వ్యాఖ్యానించినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. తాము తప్పించుకోమని ధైర్యంగా చర్చకు సిద్ధమని ప్రకటించార. రేవంత్‌ మాట మీద నిలబడే వ్యక్తే అయితే ఇచ్చిన హామీలు అమలు చేసి ఓటు అడగాలని సవాల్‌ విసిరారు. ఉదయం వెంకయ్యనాయుడు రాజకీయాల్లో హుందాతనం గురించి చెప్పిన గంటల్లోనే రేవంత్‌ చిల్లర మాటలు, అసభ్యపు మాటలు మాట్లాడడం అతడి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News