Dhanraj new Movie Launch: ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో కమెడియన్ ధనరాజ్ దర్శకత్వంలో 'ప్రొడక్షన్ నెం 1' అనే సినిమా రాబోతుంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. క్లాప్ శివబాలాజీ, కెమెరా సోలో బతుకె సో బెటర్ డైరెక్టర్ డైరెక్టర్ సుబ్బు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బలగం వేణు చేశారు. అలాగే అమిగోస్ డైరెక్టర్ రాజేంద్ర తెలుగు స్క్రిప్ట్ అందజేయాగ, డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ తమిళ్ స్క్రిప్ట్ ను యూనిట్ సభ్యులకు అందజేశారు. ఈ చిత్రాన్ని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధు నందన్, ఖయుమ్, భూపాల్, పృద్వి, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. తండ్రి కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ నటిస్తున్న ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, పృద్వి,  అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9నుండి ప్రారంభం కానుంది. విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ మాటలు సమకూరుస్తూన్నారు. ఎవరూ టచ్ చెయ్యని ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. శశి చిత్ర సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.


Also Read: Rashmika Mandanna: ''ది గర్ల్ ఫ్రెండ్''గా రాబోతున్న రష్మిక.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook