Rahu Ketu Transit 2023: రాహు కేతువులతో ధనలాభం కూడా ఉంటుందా, ఆ రాశి వారి పరిస్థితేంటి

Rahu Ketu Transit 2023: జ్యోతిష్యం ప్రకారం రాహు కేతువుల్ని నష్ట జాతక గ్రహాలుగా పిలుస్తారు. ఈ గ్రహాల ప్రభావం ఉంటే అంతా హాని కలుగుుతందని నమ్మకం. అందుకే రాహు కేతువులంటే భయపడే పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2023, 06:57 AM IST
Rahu Ketu Transit 2023: రాహు కేతువులతో ధనలాభం కూడా ఉంటుందా, ఆ రాశి వారి పరిస్థితేంటి

Rahu Ketu Transit 2023: అయితే రాహు కేతువులు ప్రతిసారీ నష్టం చేకూర్చవంటున్నారు జ్యోతిష్య పండితులు. చాలా సందర్బాల్లో రాహు కేతువుల వల్ల మంచి కూడా జరుగుతుందట. అదే విధంగా కొంతమందికి నవంబర్, డిసెంబర్ నెలల్లో రాహు, కేతువులు అద్భుతమైన లాభాల్ని అందించనున్నాయి.

అక్టోబర్ 30వ తేదీన రాహువు మీన రాశిలో ప్రవేశించనున్నాడు. అదే రోజు కేతువు కన్యా రాశి ప్రవేశముంది. ఈ రెండు గ్రహాల రాశి పరివర్తనం ధనస్సు రాశి జాతకులకు శుభం కలగనుంది. ఉద్యోగం మారాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి సమయంయ చాలా కీలకమైన స్థానం లభించవచ్చు. రాజకీయాల్లో ఉండేవారికి అధికారం లబిస్తుంది. గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. యశస్సు, కీర్తి అన్నీ దక్కుతాయి. ప్రభుత్వ ఉద్యోగం, మీడియా, సోషల్ మీడియా రంగాల్లో ఉండేవారికి నవంబర్, డిసెంబర్ నెలల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. అంతులేని ధనలాభం కలగవచ్చు. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. 

విద్యార్ధులకు చాలా అనువైన సమయంగా చెబుతారు. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. పెళ్లి కానివారికి పెళ్లి నిశ్చయం కావచ్చు. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఇంట్లో తల్లిదండ్రులు, సోదర సోదరీమణుల మధ్య ప్రేమ బందం చిగురిస్తుంది. అన్నీ సవ్యంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యం జరగనుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. తీర్ధయాత్రలకు వెళ్లవచ్చు. మీ పిల్లల పెంపకం విషయంలో కాస్త అప్రమత్తత అవసరం, లేకపోతే సమస్యలు ఎదురుకావచ్చు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం రావచ్చు. జీవిత భాగస్వామితో బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోవచ్చు. 

ఆస్థులపై పెట్టుబడి కలిసివస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి అమాంతంగా పెరుగుతుంది.షేర్ మార్కెట్ నుంచి అధిక లాభాలు ఆర్జిస్తారు. వ్యాపారులకు నవంబర్, డిసెంబర్ నెలలు చాలా అనుకూలంగా ఉండి ఊహించని లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. వ్యాపారం కూడా విస్తృతమౌతుంది.

Also read: Mercury Transit 2023: అక్టోబరు 17 వరకు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News