Captain Miller Trailer out: కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) నయా మూవీ కెప్టెన్‌ మిల్లర్‌ (Captain Miller). అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీ రోల్స్ చేస్తున్నారు.  ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది మూవీటీమ్. ఇప్పటికే ఈ సినిమా నుచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రైల‌ర్ మెుత్తం భారీ యాక్షన్ తో నిండిపోయింది. ముఖ్యంగా భారత స్వాత్రంత్యోద్యమం కాలం నాటి స్టోరీగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో ధనుష్ నటించాడు.  ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. కెప్టెన్ మిల్లన్ రన్‌ టైం 157 నిమిషాలు (2 గంటల 37 నిమిషాలు) ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కిల్లర్‌ కిల్లర్‌ (Killer Killer) సాంగ్ ఆడియెన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి పార్ట్-2 కూడా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ మిల్లన్ రిలీజైన రోజు శివకార్తికేయన్ అయలాన్‌ కూడా వస్తుంది. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వదద సందడి నెలకొంది. 



Also Read: Guntur Kaaram Trailer: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇవాళే 'గుంటూరు కారం' ట్రైలర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి