Dhanush Aishwarya Divorce : విడిపోయిన మరో జంట.. విడాకులు తీసుకున్న ఐశ్వర్య, ధనుష్
Dhanush Aishwarya Divorce: సినీ పరిశ్రమలో పెరిగిపోతున్న విడాకులు. విడాకులు తీసుకున్న రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ హీరో ధనుష్. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికింది ఈ జంట.
Dhanush Aishwarya Divorce Kollywood star hero Dhanush announces separation from his wife Aishwarya : సినీ పరిశ్రమలో ఈ మధ్య విడాకులు తీసుకునే జంటలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారంపై సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా రజనీకాంత్ కూతురు (Rajinikanth's daughter) ఐశ్వర్య, (Aishwarya) తమిళ హీరో ధనుష్ (Dhanush) విడాకులు (Divorce) తీసుకున్నారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి (18 years of married life) ఈ జంట వీడ్కోలు పలికింది.
ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు ధనుష్, ఐశ్వర్య. (Dhanush Aishwarya) ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో (Cine Industry) ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ జంట తమ విడాకుల విషయాన్ని వెల్లడించింది. వీరిద్దరి వివాహం 2004లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తాము 18 ఏళ్లుగా కలిసి ఉన్నామంటూ ధనుష్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
తాము ఫ్రెండ్స్‌గా.. భార్యాభర్తలుగా.. తల్లిదండ్రులుగా... శ్రేయోభిలాషులుగా... ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించామంటూ ధనుష్ తన పోస్ట్‌లో వెల్లడించారు. కానీ ఈ రోజు విడిపోవాల్సి వస్తోందన్నారు. తాను ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయించుకున్నామని ధనుష్ పేర్కొన్నారు. దయచేసి తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ కోరారు. తమకు ప్రైవసీ ఇవ్వాలని కోరారు. ఓం నమశివాయ.. స్ప్రెడ్ లవ్ అంటూ ధనుష్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Also Read : Rashmika Mandanna sankranthi celebrations: విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుందా ?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, (Kollywood star hero Dhanush) రజనీకాంత్ కూతురు ఐశ్వర్యలకు విడాకులు తీసుకోవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఒకవైపు తమిళ్‌లో స్టార్ హీరో అయిన ధనుష్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌లో (Bollywood) కూడా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు.
ఇక మరోవైపు ఐశ్వర్య కూడా ఇటీవలే తెలుగులో డైరెక్ట్ సినిమాకి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్య ధనుష్ ఇప్పటికే 3, వై రాజా వై వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు.
Also Read : Amullu Arjun: ఇక తన పేరు 'అముల్లు అర్జున్' అంటున్న అల్లు అర్జున్.. కారణం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook